క్రికెటర్ భార్య, సినీ నటిపై గ్యాంగ్ ఎటాక్!

By Udayavani DhuliFirst Published Jan 21, 2019, 2:30 PM IST
Highlights

ప్రముఖ మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి ఫర్హీన్ పై ఢిల్లీలో తక్ తక్ గ్యాంగ్ ఎటాక్ చేసింది. ఆమె పర్సు, మొబైల్ ఫోన్ లతో పాటు కొన్ని డాక్యుమెంట్లను సదరు గ్యాంగ్ ఎత్తుకుపోయింది. 

ప్రముఖ మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్ భార్య, బాలీవుడ్ నటి ఫర్హీన్ పై ఢిల్లీలో తక్ తక్ గ్యాంగ్ ఎటాక్ చేసింది. ఆమె పర్సు, మొబైల్ ఫోన్ లతో పాటు కొన్ని డాక్యుమెంట్లను సదరు గ్యాంగ్ ఎత్తుకుపోయింది.

ఢిల్లీలోని సర్వప్రియ విహార్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీ వాక్ మాల్ కి వెళ్లిన ఫర్హీన్ ఆ తరువాత తన కారులో ఇంటికి బయలుదేరింది. కారులో వెళ్తున్న సమయంలో ఓ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తక్ తక్ గ్యాంగ్ కి చెందిన నలుగురు దొంగలు ఆమె కారుని చుట్టుముట్టారు. 

డ్రైవింగ్ చేయడం సరిగ్గా రాదంటూ ఆమెని దూషిస్తూ ఆమె వద్ద ఉన్న పర్సుని, మొబైల్ ఫోన్ ని లాక్కొని పారిపోయారు. దొంగలు ఫర్హీన్ పై దాడికి యత్నించిన సమయంలో వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. ఆమె ఆస్తమా రోగి కావడం రోడ్డుపై పడిపోయారు. ఓ ఆర్మీ ఆఫీసర్ ఆమెకి సహాయం చేశారు.

ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫర్హీన్ పర్సులో 16 వేల రూపాయల నగదు, కొన్ని డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా తక్ తక్ గ్యాంగ్ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

click me!