నెమ్మదిగా ప్లీజ్‌.. వ్యాక్సిన్‌ వేసుకుంటూ ఏడ్చేసిన హీరోయిన్‌ అంకిత లోఖండే

Published : May 08, 2021, 04:15 PM IST
నెమ్మదిగా ప్లీజ్‌.. వ్యాక్సిన్‌ వేసుకుంటూ ఏడ్చేసిన హీరోయిన్‌ అంకిత లోఖండే

సారాంశం

కొందరు అమ్మాయిలు కూడా అలవాటు లేకపోవడంతో భయపడుతుంటారు. నటి అంకితకి కూడా ఇంజక్షన్‌ అంటే భయమట. దీంతో ఆమె గట్టిగా ఏడ్చేసింది.

హీరోయిన్‌ అంకిత లోఖండే భయంతో వణికిపోయింది. ఇంజక్షన్‌ వేస్తారన్న భయంతో గట్టిగా ఏడ్చేసింది. నర్స్ సాయంతో మొత్తానికి వ్యాక్సిన్‌ పూర్తి చేసుకుంది. ఇంజక్షన్‌ అంటే పిల్లలు భయపడటం చూసి ఉంటాం. కొందరు అమ్మాయిలు కూడా అలవాటు లేకపోవడంతో భయపడుతుంటారు. నటి అంకితకి కూడా ఇంజక్షన్‌ అంటే భయమట. దీంతో ఆమె ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కరోనా వ్యాక్సిన్‌ ఇంజక్షన్‌ వేయించుకునే సందర్బంగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది. 

కరోనాని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ వేసుకుంటున్న విషయం తెలిసిందే. 18ఏళ్ల లోపు వారు కూడా వ్యాక్సిన్‌ వేసుకోవాలని కేంద్రం తెలిపిందే. అందులో భాగంగా నటి అంకిత లోఖండే వ్యాక్సిన్‌ ఫస్ట్ డోస్‌ని నేడు(శనివారం) వేసుకుంది. ఆసుపత్రిలో నర్స్ వ్యాక్సిన్‌ వేసే టైమ్‌లో ఆమె భయంతో వణికిపోతూ ఏడ్చేసింది.  ప్లీజ్‌ నెమ్మదిగా వేయండి అంటూ రిక్వెస్ట్ చేసింది. అంకిత అంతగా భయపడటం చూసి నర్స్ కూడా నవ్వుకుంది. మొత్తానికి వ్యాక్సిన్‌ పూర్తయ్యాక హమ్మయ్య అంటూ రిలాక్స్ అయ్యింది. 

ఈ సందర్భంగా తీసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది అంకిత. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఇందులో `నేను వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఇక మీ వంతు` అని పోస్ట్ పెట్టింది.  అంకిత స్నేహితులు, అభిమానులు చాలా ముద్దుగా ఉన్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మే 1 నుంచి 18-44 ఏళ్ల వారికి టీకా వేయ‌డానికి కేంద్రం అంగీక‌రించిన‌ప్ప‌టికి ప‌లు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొర‌త వ‌ల్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే అంకిత లోఖండే.. నిరుడు ఆత్మహత్య చేసుకున్న హీరో సుశాంత్‌ సింగ్‌రాజ్‌పూత్‌తో డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. గతేడాది ఈ అమ్మడు `బాఘి2` చిత్రంలో నటించింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే
Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్