బోల్డ్ సీన్స్ లో నటించమని నా భర్తే చెప్పాడు.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Published : Jan 04, 2024, 04:23 PM IST
బోల్డ్ సీన్స్ లో నటించమని నా భర్తే చెప్పాడు.. తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సారాంశం

కొంతమంది హీరోయిన్లు కొన్ని పాత్రల్లో నటించేందుకు, కొన్ని సన్నివేశాలు చేసేందుకు ఇష్టపడరు. కొంతమంది హీరోయిన్లు బోల్డ్ గా ఎలాంటి సన్నివేశంలో అయినా నటిస్తారు.

కొంతమంది హీరోయిన్లు కొన్ని పాత్రల్లో నటించేందుకు, కొన్ని సన్నివేశాలు చేసేందుకు ఇష్టపడరు. కొంతమంది హీరోయిన్లు బోల్డ్ గా ఎలాంటి సన్నివేశంలో అయినా నటిస్తారు. తెలుగు బ్యూటీ వరంగల్ కి చెందిన ఆనంది నటిస్తున్న తమిళ చిత్రం మాంగై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఈ చిత్ర ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజై వైరల్ అవుతోంది. పెళ్లి తర్వాత కూడా ఈ చిత్రంలో ఆనంది బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. పెళ్లి తర్వాత హీరోయిన్లు ఇలాంటి సన్నివేశాల్లో నటించాలంటే కాస్త అలొచ్చిస్తారు. కొంతమంది ఒప్పుకోరు. ఆనంది కూడా మాంగై చిత్రాన్ని మొదట రిజెక్ట్ చేసిందట. 

ఈ చిత్ర కథలో మంచి సందేశం ఉంది. కానీ బోల్డ్ గా కూడా నటించాలి. కొన్ని బూతు డైలాగులు కూడా ఉన్నాయట. దీనితో ఆనంది ఈ చిత్రానికి మొదట ఒప్పుకోలేదు. ఆనంది భర్త కూడా దర్శకుడే. ఆయన పేరు సోక్రటీస్. 2021లో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సోక్రటీస్ ఆనంది మాంగై చిత్రంలో నటించేలా ప్రోత్సహించారట. బోల్డ్ సన్నివేశాలు ఉన్నా పర్వాలేదు.. మంచి కథ కాబట్టి వదులుకోవద్దు అని చెప్పారట. 

భర్త ప్రోత్సాహంతోనే తాను ఈ చిత్రంలో నటించినట్లు ఆనంది పేర్కొంది. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణమైన యువతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది ఈ చిత్ర కథ. ఫస్ట్ లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. 

ఆనంది వరంగల్ కి చెందిన అమ్మాయి కాబట్టి మొదట టాలీవుడ్ లో జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం లాంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు తమిళంలో బిజీగా మారింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌