మహేష్ పార్టీ.. విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్!

Published : May 10, 2019, 01:40 PM IST
మహేష్ పార్టీ.. విజయ్ దేవరకొండ స్పెషల్ గెస్ట్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' సినిమా గురువారం నాడు విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో చిత్రబృందం సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇటీవలే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండని మరోసారి 'మహర్షి' సెలబ్రేషన్స్ లో పాలుపంచుకున్నాడు.

సినిమాకి హిట్ టాక్ రావడం, చాలా చోట్ల రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తున్న నేపధ్యంలో మహేష్ బాబు నిన్న రాత్రి తన ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి దాటేవరకు ఈ పార్టీ కొనసాగింది. ముగ్గురు చిత్ర నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ లు ఈ పార్టీకి హాజరయ్యారు. సినిమాకు పని చేసిన యూనిట్ కూడా హాజరైంది.

నిన్న బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న విజయ్ దేవరకొండను ఈ పార్టీకి స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు. విజయ్ తో పాటు రష్మిక కూడా పాల్గొంది. మహేష్ తదుపరి సినిమా డైరెక్టర్ అనీల్ రావిపూడి కూడా రావడం విశేషం. ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలని మహేష్ భార్య నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu: అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్ ఎవ్వరితో కుదర్లేదు.. మహేష్ తో బాలీవుడ్ డైరెక్టర్ ప్రయత్నాలు ?
Bigg Boss Telugu 10: డేంజర్‌ జోన్‌లో క్రేజీ కంటెస్టెంట్, రిస్క్ లో గ్లామర్‌ బ్యూటీ, బిగ్‌ బాస్‌ ఓటింగ్‌