హీరోయిన్ తో నటుడు నోయెల్ పెళ్లి!

Published : Jan 02, 2019, 04:44 PM IST
హీరోయిన్ తో నటుడు నోయెల్ పెళ్లి!

సారాంశం

నటుడిగా టాలీవుడ్ లో విలన్ వేషాలు, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన నోయెల్ కి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఈగ, మగధీర వంటి సినిమాల్లో కూడా నటించాడు. 

నటుడిగా టాలీవుడ్ లో విలన్ వేషాలు, ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన నోయెల్ కి 'కుమారి 21 ఎఫ్' సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఈగ, మగధీర వంటి సినిమాల్లో కూడా నటించాడు. ఇప్పుడు నోయెల్ ఓ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు.

మంగలూర్ కు చెందిన కొంకణి అమ్మాయి ఈస్టర్ నోరోన్హా టాలీవుడ్ లో '1000 అబద్దాలు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తరువాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక వంటి సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ.

హీరోయిన్ గా మాత్రం ఈమెకి సరైన బ్రేక్ రాలేదు. భరతనాట్యం, పాటలు పాడడంలో దిట్ట అయిన ఈస్టర్ విదేశాల్లో షోలు కూడా ఇస్తుంటుంది. ఇప్పుడు ఈ భామ నోయెల్ తో పెళ్లికి సిద్ధమవుతోంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే చాలా కాలం అయిందట. కానీ ఈ విషయాన్ని రీసెంట్ గా రివీల్ చేసాడు నోయెల్. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది!
 

 

PREV
click me!

Recommended Stories

Bade Sahab Transformation: ధురంధర్ 2లో 'బడే సాహెబ్' ఈయనే..9 గంటల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మేకోవర్
Priyamani: 'రావణ్' తర్వాత బాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయనుకున్నా, కానీ..తన భర్తపై ప్రియమణి తొలిసారి కామెంట్స్