భార్యతో విడిపోతున్న నటుడు నోయల్..!

Published : Sep 01, 2020, 03:26 PM IST
భార్యతో విడిపోతున్న నటుడు నోయల్..!

సారాంశం

పరస్పర సమ్మతితో భార్యతో  విడిపోతున్నట్లు నోయల్ తెలిపారు. అలాగే ఎస్తేరు భవిష్యత్తు బాగుండాలని, జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకున్నారు. ఇక తమ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేధాలే విడిపోవడానికి కారణం అని నోయల్ తెలిపారు. 


ప్రముఖ సింగర్ మరియు నటుడు నోయల్ సోషల్ మీడియా ద్వారా ఓ  ముఖ్యమైన విషయం తెలియజేశారు. నోయల్ తన భార్య ఎస్తేరు కు విడాకులు ఇస్తున్నట్లు తెలియజేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఇద్దరు తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. ఇద్దరు విడాకులకు అప్లై చేశాం అని ఆయన తెలియపరిచారు.  

ఇద్దరం పరస్పర సమ్మతితో విడిపోతున్నట్లు నోయల్ తెలిపారు. అలాగే ఎస్తేరు భవిష్యత్తు బాగుండాలని, జీవితం సుఖ సంతోషాలతో సాగాలని కోరుకున్నారు. ఇక తమ మధ్య ఏర్పడిన అభిప్రాయ భేధాలే విడిపోవడానికి కారణం అని నోయల్ తెలిపారు. కోర్ట్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న నేను సైలెన్స్ బ్రేక్ చేసి ఉన్న విషయం చెవుతున్నాను అన్నారు. 

ఇక ఈ విషయమై ఎస్తేరును కానీ, తనను తన ఫ్యామిలీని కానీ ఎవరు ఇబ్బంది పెట్టొద్దని నోయల్ తెలిపారు. గడ్డుపరిస్థితుల్లో తనకు తోడుగా ఉన్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు తెలిపారు. దేవుడునిపై నమ్మకముందన్న నోయల్ ఇది జీవితానికో కొత్త ఆరంభం అన్నారు. గత ఏడాది నోయల్ నటి ఎస్తేరు ను వివాహం చేసుకున్నారు. క్రిస్టియన్ సంప్రదాయంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 

 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా