బైక్ పై నుండి పడ్డ హీరో గోపీచంద్.. తీవ్ర గాయాలు!

Published : Feb 18, 2019, 12:48 PM ISTUpdated : Feb 18, 2019, 01:28 PM IST
బైక్ పై నుండి పడ్డ హీరో గోపీచంద్.. తీవ్ర గాయాలు!

సారాంశం

సినీ నటుడు గోపీచంద్ కి తీవ్ర గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో లో భాగంగా హీరో బైక్ నడపాల్సివుంది. 

సినీ నటుడు గోపీచంద్ కి తీవ్ర గాయాలు తగిలినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లో సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో లో భాగంగా హీరో బైక్ నడపాల్సివుంది. 

ఈ క్రమంలో బైక్ పై నుండి గోపీచంద్ పడిపోయినట్లు సమాచారం. దీంతో ఆయన శరీరానికి గాయలైనట్లు సమాచారం. వెంటనే అతడిని దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. 

గోపీచంద్ గాయపడిన విషయాన్ని నిర్మాత బిఎ రాజు ధ్రువీకరించారు. జైపూర్ సమీపంలోని మాండ్వా వద్ద షూటింగ్ లో ఆయన గాయపడినట్లు తెలిపారు. 

గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జైపూర్ సమీపంలోని మాడ్వా లో జరుగుతోంది. 

సోమవారంతో అక్కడ చిత్రీకరణ ముగించుకుంటున్న నేపథ్యంలో హీరో గోపీచంద్ పై బైక్ ఛేజింగ్ పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా బైక్ స్కిడ్ అయింది. దీంతో గోపీచంద్ గాయపడ్డాడు.

గోపీచంద్ ఆరోగ్యానికి ఏ విధమైన ప్రమాదం లేదని, గాయాలకు చికిత్స తీసుకున్న తర్వాత మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చునని అక్కడి ఫోర్టీస్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ANR: కమ్మకులంలో పుట్టినవ్‌ సిగ్గులేదా.. స్టార్‌ హీరోయిన్‌ని పట్టుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఏఎన్నార్‌
Alpha Trailer: 'ఆల్ఫా' ట్రైలర్‌లో ఐదుగురు స్టార్స్.. పాన్ ఇండియా హీరోని 2 సెకన్లు చూపించి దాచేశారుగా