ఆసుపత్రి నుంచి నటుడు దిలీప్‌ కుమార్‌ డిశ్చార్జ్..

Published : Jun 11, 2021, 12:23 PM IST
ఆసుపత్రి నుంచి నటుడు దిలీప్‌ కుమార్‌ డిశ్చార్జ్..

సారాంశం

లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌(98) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. శుక్రవారం ఆయన్ని డిశ్చార్చ్ చేస్తున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. 

లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్‌(98) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. శుక్రవారం ఆయన్ని డిశ్చార్చ్ చేస్తున్నట్టు వైద్యులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం దిలీప్‌ కుమార్ ముంబయిలోని పీడీ హిందుజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత వారం క్రితం దిలీప్‌ కుమార్‌ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ విషయాన్ని దిలీప్‌ కుమార్‌ మేనేజర్‌ తెలిపారు.

దాదాపు వారం రోజుల ట్రీట్‌మెంట్‌ అనంతరం శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్టు తెలిపారు. ఆయనకు డాక్టర్ జలిల్‌ పర్కర్‌ ఆధ్వర్యంలో ట్రీట్‌మెంట్‌ జరిగింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఏలిన లెజెండరీ నటుడు దిలీప్‌ కుమార్. అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. వయోభారం రీత్యా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?