బిగ్ బాస్ షో సండే చాలా ఆసక్తికరంగా సాగింది. ఎంత ఎంటర్ టైనింగ్ గా సాగిందో.. ఆట సందీప్ ఎలిమినేషన్ తో అంతే భావోద్వేగంగా ముగిసింది. ఇక ఫన్నీ టాస్క్ , మీమ్ ఆఫ్ ది షోతో ఆద్యంతం వినోదాన్ని అందించింది.
సండే బిగ్ బాస్ షో ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది. నాగార్జున కొన్ని ఫన్నీ టాస్క్స్ పెట్టాడు. మొదట బ్లాక్స్ తో రెండు టీమ్ గా కంటెస్టెంట్లు టవర్స్ ను నిర్మించాలని ఆదేశించారు. ఆ తర్వాత బోట్ గేమ్ ఆడించారు. ప్రతి కంటెస్టెంట్ తను చెప్పిన ఇద్దరు హౌస్ మేట్స్ లో తమ బోటులో ఎవరిని ఉంచుకుంటారో? ఎవరిని ముంచేస్తారో చెప్పాలని ఆదేశించాడు. తొలుత గౌతమ్ - అర్జున్ ను బోటులో నుంచి తోచేశారు. ప్రియాంకను బోటులో ఉంచుకున్నారు. తనతో ఎక్కువ బాండింగ్ ఉండటంతోనే అలా చేశానని చెప్పారు. ఇక అర్జున్ బోట్ లో మాత్రం గౌతమ్ - అమర్ దీప్ ఉండగా.. అమర్ దీప్ ను ముంచేశారు.
ఆ వెంటనే అమర్ బోట్ లో ఉన్న ప్రియాంక -శోభా ఇద్దరిలో ప్రియాంకను ముంచేస్తున్నట్టు చెప్పారు. ఇక అమర్ దీప్ ఇచ్చిన ఆన్సర్ పై నాగార్జున పంచులు పేల్చారు. శోభా శెట్టికి బుర్రలేదని అమర్ దీప్ అంటున్నాడని రిపీట్ చేశారు. ఆ తర్వాత యావర్ తన బోటులోంచి రతికను తోసేసి శివాజీని సపోర్ట్ చేశారు. భోలే - అశ్వినిని, తేజ - శోభా శెట్టిని, ఆ నెక్ట్స్ శివాజీ ప్రశాంత్ ను సపోర్ట్ చేస్తూ యావర్ ను బోట్ నుంచి తోసేశారు. ప్రియాంక - అమర్ దీప్ ను, ఆట సందీప్ - శివాజీని ముంచేశారు. రతిక - యావర్ ను, శోభాశెట్టి - సందీప్ ను ముంచేయగా గేమ్ ఆసక్తికరంగా సాగింది.
undefined
అంతకు ముందు ఈరోజు నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్లు శివాజీ, శోభా శెట్టి, అమర్ దీప్, ఆట సందీప్, అశ్విని, భోలే షావలి ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరికీ బాక్సులను అందించారు. అందులో గోల్డ్ మెడల్ ఉంటే సేఫ్? లేదంటే నాట్ సేఫ్ అని సూచించారు. భోలే, శివాజీ, అమర్, సందీప్, శోభాశెట్టి బ్లాక్ మెడల్ అందుకొని నాట్ సేఫ్ లో నిలిచారు. అశ్విని మాత్రం గోల్డ్ మెడల్ తో సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ర్యూబిక్ గేమ్ లో అమర్ దీప్ సేఫ్ అయ్యారు.
అనంతరం 'డైలాగ్ కొట్టు గురూ' అనే ఫన్నీ గేమ్ ఆడించారు. ఒకరు హెడ్ ఫోన్ పెట్టుకొని లౌడ్ మ్యూజిక్ వింటూ ఉంటారు. ఎదుటివాళ్ళు ఒక డైలాగ్ చెబుతారు. హెడ్ ఫోన్ పెట్టుకున్న హౌస్ మేట్ ఆ డైలాగ్ లిప్ సింక్ ఆధారంగా కనిపెట్టాలి. ఈ గేమ్ అమర్-పల్లవి ప్రశాంత్ ఆడి గెలిచారు. యావర్-శోభా ఓడిపోయారు. తేజ-రతిక ఆడారు. ప్రియాంక-సందీప్ ఆడారు. గేమ్ అయితే ఫన్నీగా ఎంటర్టైనింగ్ గా సాగింది. అయితే నాగార్జున ప్లే చేసిన 'మీమ్ ఆఫ్ ది వీక్' నవ్వులు పూయించింది. అలాగే గేమ్ చివర్లలో తమ డాన్స్ తోనూ అదరగొట్టారు. అలాగే నామినేషన్స్ లో పల్లవి ప్రశాంత్-గౌతమ్ మధ్య జరిగిన గొడవను కోట బొమ్మాళి చిత్రంలోని 'లింగ్ లింగ్ లింగిడి' సాంగ్ కి సింక్ చేశారు. ఈ మీమ్ లో పల్లవి ప్రశాంత్, గౌతమ్, రతిక ఎక్స్ప్రెషన్స్ విపరీతమైన ఫన్ జెనెరేట్ చేశాయి.
తర్వాత షిప్ ను నాట్ సేఫ్ లో ఉన్న వారి చేతికి ఇచ్చారు. బుడగల సౌండ్ వస్తే నాట్ సేఫ్ అని, హారన్ వస్తే సేఫ్ అని తేల్చారు. ఈ గేమ్ లో శోభా, భోలే, సందీప్ నామినేషన్ లో ఉన్నారు. శివాజీ షిప్ హారన్ మోగడంతో సేఫ్ జోన్ లోకి వెళ్లారు. ఇక నామినేషన్ లో మిగిలిన ముగ్గురిలో భోలే గ్రీన్ ఫ్లగ్ తో నామినేషన్ నుంచి బయటపడ్డారు. సందీప్ - శోభా శెట్టి యాక్టివిటీ రూమ్ లోకి వెళ్లారు. ఫైనల్ గా ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యారు. ఈ సందర్భంగా శోభా శెట్టి చాలా ఎమోషనల్ అయ్యింది. ఇప్పటికే హౌజ్ నుంచి వరుసగా ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఈసారి కూడా నేనే అవుతానని చాలా భయపడ్డానంటూ భావోద్వేగమైంది. టేస్టీ తేజా గట్టిగా హగ్ చేసుకొని ఏడ్చారు.
ఇక సందీప్ హౌజ్ ను వీడిపోతూ తన మ్యూచువల్ ఫండ్ బాక్సు ను అమర్ దీప్ కు అందించారు. ఏడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీతోనే పవర్ అస్త్రను దక్కించుకొని ఐదువారాల ఇమ్యూనిటీని సొంతం చేసుకున్నారు. తన ఆటతో అలరించారు. ప్రతి ఒక్కరితో ఫన్నీ మూమెంట్స్ ను క్రియేట్ చేశారు. ఫస్ట్ హౌజ్ మేట్ గా కన్ఫమ్ కూడా అయ్యారు. ప్రతి టాస్క్ లోనూ చక్కగా ఆడారు. ఎనిమిదో వారం నుంచి నామినేషన్స్ లోకి వచ్చారు. ఫైనల్ గా ఈరోజు ఎలిమినేట్ అవ్వడం ఆశ్చర్యకరంగా మారింది.