ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!

Published : Jun 13, 2019, 09:56 AM IST
ప్రేమలో మునిగి తేలుతున్న స్టార్ హీరో కూతురు!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ చాలా కాలంగా సంగీతకారుడు మిశాల్ కిర్పలానితో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇరా ఖాన్ స్పందించింది. 

ఇన్స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' అనే సెషన్ లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఇరా ఖాన్ సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నారా..? అని ప్రశ్నించగా.. దానికి ఇరాఖాన్ ఓ ఫోటోతో బదులిచ్చింది.

మిశాల్ ని కౌగిలించుకున్న ఉన్న ఫోటో షేర్ చేసి తన ప్రేమని కన్ఫర్మ్ చేసింది.  గత కొంతకాలంగా డేటింగ్ లో ఉన్న ఈ జంట తమకి సంబంధించిన ఫోటోలను సోషల్  మీడియాలో షేర్ చేశారు.

ఇక ఇరా కెరీర్ విషయానికొస్తే.. తండ్రిలానే నటనలో రాణిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇరా ఖాన్ కి నిర్మాణంపై ఆసక్తి ఉందని అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 


 

PREV
click me!

Recommended Stories

Bade Sahab Transformation: ధురంధర్ 2లో 'బడే సాహెబ్' ఈయనే..9 గంటల మేకప్‌తో గుర్తుపట్టలేనంతగా మేకోవర్
Priyamani: 'రావణ్' తర్వాత బాలీవుడ్‌లో ఛాన్సులు వస్తాయనుకున్నా, కానీ..తన భర్తపై ప్రియమణి తొలిసారి కామెంట్స్