అందుకే ఆమెకు విడాకులిచ్చా.. స్టార్ హీరో కామెంట్స్!

Published : Nov 05, 2018, 03:59 PM IST
అందుకే ఆమెకు విడాకులిచ్చా.. స్టార్ హీరో కామెంట్స్!

సారాంశం

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ అతి చిన్నవయసులో రీనాదత్తాను పెళ్లి చేసుకున్నారు. అయితే 2002లో ఆమెకి విడాకులిచ్చేశాడు. ఇప్పటికీ వారి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్.. రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక గల కారణాలను వెల్లడించాడు. 

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ అతి చిన్నవయసులో రీనాదత్తాను పెళ్లి చేసుకున్నారు. అయితే 2002లో ఆమెకి విడాకులిచ్చేశాడు. ఇప్పటికీ వారి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న అమీర్ ఖాన్.. రీనాకు విడాకులు ఇవ్వడం వెనుక గల కారణాలను వెల్లడించాడు. ఆమెకు విడాకులు ఇచ్చినంత మాత్రాన ఆమెపై గౌరవం లేనట్లు కాదని అన్నారు. 'రీనాతో విడిపోయిన సమయంలో మా ఇద్దరితో పాటు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడ్డారు.

కానీ మా ఇద్దరి మధ్య  అభిప్రాయబేధాలు వచ్చిన తరువాత కలిసి ఉండడంతో అర్ధం లేదనిపించింది. ఆమెపై నాకున్న ప్రేమ తగ్గిపోయింది. చాలా చిన్న వయసులో మా ఇద్దరికీ వివాహం జరిగింది. బహుసా అది కూడా ఒక కారణం కావొచ్చు.

భార్యాభర్తలుగా విడిపోయామే కానీ స్నేహితులుగా ఎప్పటికీ కలిసే ఉంటాం. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటామని' చెప్పుకొచ్చాడు. రీనాతో విడిపోయిన తరువాత అమీర్ ఖాన్.. కిరణ్ రావుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?