ఆరు నెలల్లో హోటల్‌ రూమ్‌లో చనిపోయినా ఆశ్చర్యం లేదు.. డాక్టర్‌ చెప్పిన షాకింగ్‌ విషయం బయటపెట్టిన స్టార్‌ సింగర్‌

Published : Jun 05, 2025, 09:20 PM IST
adnan sami

సారాంశం

సింగర్‌ అద్నాన్‌ సమీ తన లైఫ్‌కి సంబంధించిన షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు.  ఆరు నెలల్లో తాను చనిపోతానని డాక్టర్లు చెప్పిన విషయాన్ని బయటపెట్టి షాకిచ్చారు. 

సింగర్ అద్నాన్ సమీ ఒక ఇంటర్వ్యూలో తన బరువు ఒకప్పుడు 230 కిలోలు ఉండేదని చెప్పారు. ఈ విషయం డాక్టర్లకు తెలియగానే, వారు అద్నాన్‌ని ఆయన తండ్రి ముందే బాగా మందలించారట. బరువు తగ్గకపోతే 6 నెలల్లో చనిపోతారని కూడా చెప్పారట. 

అద్నాన్ సమీ బయటపెట్టిన షాకింగ్‌ విషయం 

అద్నాన్‌ సమీ ఇంటర్వ్యూలో చెబుతూ, డాక్టర్లు తన పరిస్థితి బోర్డర్ లైన్‌లో ఉందని చెప్పినట్టు వెల్లడించారు.  ఇదే లైఫ్‌స్టైల్ కంటిన్యూ చేస్తే, 6 నెలల తర్వాత హోటల్ రూమ్‌లో చనిపోయినా ఆశ్చర్యం లేదన్నారట. ఇది తనకు షాక్ గురి చేసిందని, కానీ ఈ విషయం నాన్న ముందు చెప్పడం తనకు కోపం తెప్పించిందన్నారు అద్నాన్‌ సమీ. 

`డాక్టర్లు మెలోడ్రామాటిక్‌గా ఉంటారని నాన్నతో చెప్పి వాళ్ళ మాట పట్టించుకోవద్దని అన్నాను. డాక్టర్ దగ్గర నుంచి వచ్చాక, నేరుగా బేకరీకి వెళ్లి అక్కడి సగం సామానులు తిన్నాను. నాన్న కోపంగా చూస్తూ, భగవంతుడికి భయం లేదా అని అడిగారు. డాక్టర్ మాట వినలేదని నన్ను మందలించారు. దానికి నేను డాక్టర్లు ఏదో ఒకటి అంటూనే ఉంటారని అన్నాను` అని వెల్లడించారు. 

అద్నాన్ బరువు తగ్గడానికి ఇలా నిర్ణయించుకున్నారు

బరువు ఎక్కువగా ఉండటం వల్ల పడుకుని నిద్రపోలేక, చాలా సంవత్సరాలు కూర్చునే నిద్రపోయానని ఆయన చెప్పారు. తన బిడ్డను ఖననం చేయడం ఇష్టం లేదని నాన్న అన్నారని, ఆ తర్వాత బాగా ఏడ్చేసినట్టు తెలిపారు అద్నాన్‌.  

అప్పుడే బరువు తగ్గాలని నిర్ణయించుకుని 120 కిలోలు తగ్గినట్టు చెప్పారు. సర్జరీ చేయించుకుని బరువు తగ్గారని చాలా మంది అన్నారు. కానీ అద్నాన్ ఆ వాదనలను ఖండించి, పోషకాలున్న ఆహారం తీసుకుని బరువు తగ్గినట్టు వెల్లడించారు. ఇప్పుడు ఆయన వంద కేజీలకు అటు ఇటుగా బరువుని మెయింటేన్‌ చేస్తున్నారు. చాలా స్లిమ్‌ అయ్యారు. మళ్లీ తన సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నారు అద్నాన్‌ సమీ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

పూలచీరలు కట్టిన ప్రియాంక చోప్రా
Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?