
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం RRR.దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో చిత్రం టీమ్ ప్రమోషన్స్ ఓ రేంజిలో చేస్తున్నారు. దేశం మొత్తం పర్యటిస్తూ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో నాటు నాటు సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
RRR సినిమా నుంచి విడుదలైన నాటు నాటు సాంగ్ కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. సామాన్యులు, సెలబ్రిటీలు అందరూ ఈ పాటలో ఎన్టీఆర్, చరణ్ వేసిన స్టెప్‌ను వేసి ఆ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు..ఇంకా చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా ఈ పాటను అందరూ ఎంజాయ్ చేశారు. తాజాగా అమీర్ ఖాన్ ... నాటు నాటు పాటకు కాలు కదిపిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
హిందీ వెర్షన్స్ ప్రమోషన్స్ లో భాగం గా ఢిల్లీ వెళ్లారు ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్. అమీర్ ఖాన్ ఈ వేడుక కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుక లో అమీర్ ఖాన్ నాటు నాటు హిందీ బీట్ కి స్టెప్పులు వేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ లు సైతం స్టెప్పులు వేయడం జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. మీరూ ఈ వీడియో పై లుక్కేయండి.
నాటు నాటు వీర నాటు పాట...కు ఊరమాస్ మ్యూజిక్… తారక్, చరణ్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టించింది. ఇక మరోసారి కిరవాణి తన మ్యూజిక్‌తో దుమ్ము రేపారు. పాట రిలీజ్ అయిన నాటి నుంచీ నాటు నాటు వీర నాటు పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ప్రేక్షకుల చూపు మొత్తం చెర్రీ, తారక్ కలిసి వేసిన నాటు నాటు స్టెప్పులపైనే నిలిచిపోయింది. పాటలో కాళ్లను ఎడమవైపు, కుడివైపుతోపాటు ముందుకు, వెనక్కు కదులుతూ ఉండాలి. ఈ స్టెప్స్ పర్ఫెక్ట్ గా రావడానికి చరణ్, తారక్ 15-18 టేక్స్ తీసుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ చిత్రం లో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ నటిస్తుండగా, శ్రియ శరణ్, అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.