Pushpa 2 : ‘పుష్ప2’ సెట్స్ లో వందలకొద్ది లారీలు.. సుకుమార్ గట్టిగానే ప్లాన్ చేశారుగా.. వీడియో వైరల్

By Asianet News  |  First Published Sep 7, 2023, 1:40 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2‘ షూటింగ్ రీసెంట్ గా ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా సెల్స్ నుంచి వందలకొద్దీ లారీలు ఉన్న వీడియో లీకైంది. నెట్టింట వైరల్ గా మారింది. 
 


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  ప్రస్తుతం ‘పుష్ప2‘లో నటిస్తున్న విషయం తెలిసిందే. ‘పుష్ప’తో క్రియేట్ చేసిన సెన్సేషన్ కు పార్ట్2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. రీసెంట్ గానే Pushpa 2  షూటింగ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. బన్నీ రేంజ్ కు తగ్గట్టుగానే షూట్ కొనసాగుతోంది. యాక్షన్ సీక్వెన్స్ ను గ్రాండ్ గా చిత్రీకరిస్తున్నారు. 

ఈ క్రమంలో పుష్ప సెట్స్ నుంచి ఓ వీడియో లీకైంది. సెట్స్ లో వందలకొద్ది లారీలను వరుస క్రమంలో పార్క్ చేసి ఉంచారు.  పార్ట్ వన్ లో లారీలతో పుష్ప చేయించిన స్టంట్స్ ఎంత హిట్ అయ్యాయో తెలిసిందే. థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియెన్స్ చేత విజిల్స్ వేయించాయి. ఈ క్రమంలోనే మళ్లీ లారీలతో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదో పెద్దమొత్తంలో సుకుమార్ స్కెచ్ వేశారని వీడియో చూస్తే అర్థం అవుతోంది. ఇన్నీ లారీలతో యాక్షన్ సీన్ పడితే థియేటర్లు బద్దలనే అంటున్నారు. 

Latest Videos

 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేసింది యూనిట్. మరో భారీ యాక్షన్ కు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇలా లీక్డ్ అప్డేట్స్ తోనూ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్న ఈ చిత్రం అదే స్థాయిలో రూపుదిద్దుకుంటోంది. ఇక ప్రమోషన్స్ ను కూడా మేకర్స్ భారీగానే నిర్వహిస్తున్నారు. 

గతంలో పుష్ప నుంచి వచ్చిన Where is Pushpa  గ్లింప్స్ కు ఎంతటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. పోస్టర్లు కూడా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక మున్ముందు వచ్చే అప్డేట్స్ కు సినిమా మార్కెట్ మరింతగా పెరగడం ఖాయమంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం అందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్. ఫాహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవీ శ్రీ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది మార్చిలో చిత్రాన్ని విడుదల కు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 

edo gattigane plan chesthunnadu 🔥🔥 💥💥💥 pic.twitter.com/CIkwnSuX2r

— Filmy Bowl (@FilmyBowl)
click me!