ఎన్టీఆర్, చరణ్ ల ఇంట్రడక్షన్ సాంగ్ కోసం రూ.3 కోట్లు!

Published : Jul 01, 2019, 03:00 PM IST
ఎన్టీఆర్, చరణ్ ల ఇంట్రడక్షన్ సాంగ్ కోసం రూ.3 కోట్లు!

సారాంశం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది.

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తోన్న 'RRR' సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.

దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోల ఇంట్రడక్షన్ సాంగ్ కోసం దర్శకుడు రాజమౌళి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించడానికి సిద్ధమవుతున్నాడట. 

రామోజీఫిలిం సిటీలో భారీగా సెట్ ను నిర్మించి ఈ పాటను చిత్రీకరించబోతున్నారు. ఈ పాట ఇద్దరు హీరోల పాత్రలను, స్వాతంత్య్రం కోసం వారు పడ్డ కష్టాలను వివరిస్తూ  సాగుతుందట. ఈ ఒక్క పాట ప్రొడక్షన్ కాస్ట్ మూడు కోట్లకు దగ్గరగా ఉంటుందని చెబుతున్నారు.

ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ని ఫైనల్ చేసిన తరువాత ఈ పాటను చిత్రీకరిస్తారట. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?