2.0 న్యూ రికార్డ్.. 500 కోట్లు!

Published : Dec 06, 2018, 08:39 PM IST
2.0 న్యూ రికార్డ్.. 500 కోట్లు!

సారాంశం

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 ఫైనల్ గా 500 కోట్ల మార్క్ ను అందుకుంది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ నటించిన ఈ విజువల్ వండర్ 3డిలో అద్భుతమైన రిజల్ట్ ను అందుకుంది. 

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 ఫైనల్ గా 500 కోట్ల మార్క్ ను అందుకుంది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ నటించిన ఈ విజువల్ వండర్ 3డిలో అద్భుతమైన రిజల్ట్ ను అందుకుంది. లైకా భారీ నిర్మాణ విలువలు విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు రెహమాన్ నేపథ్య సంగీతం, మంచి సందేశం సినిమాకు పాజిటివ్ టాక్ ను అందించాయి. 

సినిమా కలెక్షన్స్ ఇప్పుడు కొద్దిగా తగ్గుతున్నప్పటికీ ముందు ముందు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఎనలిస్ట్ లు భావిస్తున్నారు. అలా కాకపోయినా ఇదే తరహాలో కలెక్షన్స్ కొనసాగితే మరిన్ని లాభాలు అందవచ్చని తెలుపుతున్నారు. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మార్క్ ను అందుకొని ఇండియాలోనే మరో అద్భుతమైన చిత్రంగా 2.0 నిలిచింది. 

చైనాలో కూడా 50 వేల స్క్రీన్స్  లో భారీగా రిలీజ్ చేయడానికి లైకా ప్రొడక్షన్ ఇప్పటికే ప్లాన్ ను రెడీ చేసుకుంది. ఇక హిందీ వెర్షన్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ ను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ చిత్రం తెలుగు తమిళ్ లో కంటే హిందీలోనే ఎక్కువ లాభాలను అందుకుంది.  

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్