హిందీలో తప్ప అంతటా లాసే?

Published : Jan 03, 2019, 07:36 PM ISTUpdated : Jan 03, 2019, 07:38 PM IST
హిందీలో తప్ప అంతటా లాసే?

సారాంశం

శంకర్ విజువల్ వండర్ బాలీవుడ్ లో తప్పా మరెక్కడ లాభాలను అందించలేదు. నిర్మాత అయితే నష్టాల నుంచు తప్పించుకున్నాడు గాని బయ్యర్లను మాత్రం సినిమా సగంలో సగం నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ లో ఎప్పుడు లేని విధంగా భారీ విజువల్ వండర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 2పాయింట్0. అయితే సినిమాకు మొదట్లో వచ్చిన టాక్ కి అసలు సినిమాకు పెట్టిన బడ్జెట్ లో ఎంతవరకు వెనక్కి తెస్తుందో అనే ఒక ఆందోళన అయితే ఉండేది. కానీ సినిమాలో కొన్ని అంశాలు హై బడ్జెట్ లో తీసారని సింపతీ బాగా వర్కౌట్ అయ్యింది. 

ఫైనల్ గా శంకర్ విజువల్ వండర్ బాలీవుడ్ లో తప్పా మరెక్కడ లాభాలను అందించలేదు. నిర్మాత అయితే నష్టాల నుంచు తప్పించుకున్నాడు గాని బయ్యర్లను మాత్రం సినిమా సగంలో సగం నష్టాలను మిగిల్చినట్లు తెలుస్తోంది. తమిళ్ లో 100 కోట్ల ప్రీ రిలీజ్ కు సినిమా 60 కోట్లని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో అయితే 75కోట్లకు కొనుగోలు చేయగా 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందాయని టాక్. 

కేవలం హిందీలో మాత్రమే రిలీజ్ చేసిన కరణ్ జోహార్ కి మంచి లాభాలు అందాయి. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా రిలీజ్ అనంతరం 200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇక సౌత్ లో బయ్యర్లకు భారీ నష్టాలూ తప్పేలా లేవు. దాదాపు సినిమా బిజినెస్ క్లోజ్ అయ్యే టైమ్ దగ్గరపడింది. ఎందుకంటే భారీ సినిమాలు వరుసగా పండగ సీజన్ లో సందడి చేయనున్నాయి. దీంతో 2.0 ను ఇంకా రన్ చేసే అవకాశమే లేదు. త్వరలోనే సినిమా ఫైనల్ కలెక్షన్స్ లిస్ట్ తెలిసే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

NTR and Vijay: ఆగిపోయిన ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ చిత్రాలు.. బెడిసికొడుతున్న రాజమౌళి స్ట్రాటజీ
Ram Charan: కెరీర్ లో 2 సార్లు కాస్ట్లీ మిస్టేక్స్ చేసిన రాంచరణ్.. చిరంజీవి కూడా ఏం చేయలేకపోయారా ?