ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

By Udayavani DhuliFirst Published Nov 19, 2018, 2:03 PM IST
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రజినీకాంత్ తన అభిమానులకి, ప్రజా సంఘ కార్యకర్తలకు, థియేటర్ యాజమాన్యాయానికి హెచ్చరికలు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలంటే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు టికెట్లను 
అమ్ముతున్నారు. 

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన '2.0' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో రజినీకాంత్ తన అభిమానులకి, ప్రజా సంఘ కార్యకర్తలకు, థియేటర్ యాజమాన్యాయానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలంటే నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేట్లకు టికెట్లను అమ్ముతున్నారు. రూ.200 టికెట్ ను రెండు వేల నుండి 5 వేల వరకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆశపడే అభిమానులు అంత మొత్తాన్ని పెట్టి టికెట్లను కొంటున్నారు.

ఇటీవల విజయ్ నటించిన 'సర్కార్' సినిమా విషయంలో కూడా ఇలానే జరిగింది. దీంతో రజినీకాంత్ ఆదివారం నాడు తన ప్రజా సంఘం కార్యకర్తలకు, థియేటర్ యాజమాన్యానికి ఒక హెచ్చరిక చేశారు. తన ట్విట్టర్ లో ఈ విషయంపై ట్వీట్ చేస్తూ.. ''త్వరలో విడుదల కానున్న 2.0 సినిమాకి గాను థియేటర్లలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు అని చెప్పి టికెట్లను పొందిన వారు బయట వారికి వాటిని విక్రయించకూడదు.

అదే విధంగా అభిమానుల నుండి థియేటర్ యాజమాన్యం నిర్ణయించిన టికెట్ ధర కంటే ఎక్కువ వసూలు చేయరాదు. దీన్ని అతిక్రమిస్తే తగు చర్యలు తీసుకుంటాం'' అంటూ వార్నింగ్ ఇచ్చారు.  

click me!