పొట్ట చెక్కలు చేసిన వెంకీ, త్రివిక్రమ్.. 18 ఏళ్ళు పూర్తి!

Published : Sep 06, 2019, 09:34 PM IST
పొట్ట చెక్కలు చేసిన వెంకీ, త్రివిక్రమ్.. 18 ఏళ్ళు పూర్తి!

సారాంశం

విక్టరీ వెంకటేష్, ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరచిపోలేరు. మొదటి నుంచి చివరి వరకు వినోదాన్ని అందించే క్లాసిక్ గా ఆ చిత్రం నిలిచిపోతుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2001లో విడుదలైంది. నేటికి ఆ చిత్రం విడుదలైన 18 ఏళ్ళు పూర్తవుతోంది. 

కడుపుబ్బా నవ్వించే కామెడీ.. వెంకీ, ఆర్తి అగర్వాల్ మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ.. ప్రకాష్ రాజ్ అద్భుత నటన, వినసొంపైన సంగీత ఇలా అన్ని అంశాలతో నువ్వు నాకు నచ్చావ్ చిత్రం ఎవర్గ్రీన్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై 18 ఏళ్ళు పూర్తయ్యాయి. 

నువ్వు నాకు నచ్చావ్ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగ్స్. ప్రకాష్ రాజ్ డైనింగ్ టేబుల్ వద్ద చదివే కవిత, వెంకటేష్ దేవుడా ఓ మంచి దేవుడా అంటూ చేసే పూజకు ప్రతి ఒక్కరి పొట్ట చెక్కలు కావాల్సిందే. త్రివిక్రమ్ రాసిన అద్భుతమైన కామెడీ డైలాగ్స్ ని వెంకటేష్ తన టైమింగ్ తో అంతే అద్భుతంగా పండించారు. 

కేవలం కామెడీ మాత్రమే కాదు కుటుంబ బంధాలు, వాటి విలువలు, ప్రేమ గొప్పతనం గురించి ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. వెంకటేష్, ఆర్తి అగర్వాల్ తో పాటు ఈ చిత్రంలో నటి సుధ, హేమ , ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, సుహాసిని నటించారు. 

PREV
click me!

Recommended Stories

మాజీ భార్య, గర్ల్ ఫ్రెండ్ తో కలిసి హృతిక్ రోషన్ బర్త్ డే సెలబ్రేషన్స్.. రిచ్ గా క్రూజ్ షిప్ లో పార్టీ
అఖండ 2 తర్వాత మరో సినిమా రిలీజ్ కి రెడీ.. క్రేజీ హీరోయిన్ గ్లామరస్ పిక్స్ వైరల్