justice for disha : ఎన్ కౌంటర్ పై పూరి ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

By AN TeluguFirst Published Dec 6, 2019, 11:04 AM IST
Highlights

‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. 

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.

మరణశిక్షని సమర్ధించను కానీ.. మంచు లక్ష్మీ కామెంట్స్!

ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణా పోలీసులకు సెల్యూట్ చేసిన పూరి జగన్నాథ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చేతులెత్తి మొక్కుతున్నానని చెప్పారు.

'మీరే నిజమైన హీరోలు.. నేను నమ్మేది ఒక్కటే.. మనకి కష్టమొచ్చినా, కన్నీళ్లు వచ్చినా పోలీసోడే వస్తాడు.. నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే' అంటూ రాసుకొచ్చాడు. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

పోలీసులు అన్ని కేసుల్లో ఇలా ప్రవర్తించరని.. వాళ్లు సామాన్యులని ఎన్కౌంటర్ చేశారు మంచిదే.. వాళ్లు రాజకీయ నాయకుల కొడుకులు, మనవళ్లు అయితే  అయితే ఏం చేసేవారు అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటి కేసులు చాలానే ఉన్నాయని, అవి కూడా పరిష్కరిస్తే అప్పుడు మీ ట్వీట్ కి అర్ధముందంటూ పూరికి కౌంటర్లు వేస్తున్నారు. 

 

SALUTE 🙏🏽Telangana పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను you are the real heros .I always believe one thing మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే 🙏🏽

— PURIJAGAN (@purijagan)
click me!