ఇక నా భర్తతో ఉండలేను.. సోనూ సూద్ ని వింతైన కోరిక కోరిన మహిళ

Published : Jun 01, 2020, 02:21 PM ISTUpdated : Jun 01, 2020, 02:24 PM IST
ఇక నా భర్తతో ఉండలేను.. సోనూ సూద్ ని వింతైన కోరిక కోరిన మహిళ

సారాంశం

సోనూ సూద్ వెండితెరపై విలన్ గా చేసినప్పటికీ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అంతే కాదు తన మంచి మనసుతో రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 

అలాంటి వారందరికీ సోనూ సూద్ సాయం చేస్తున్నాడు. కేరళలో దాదాపు 180 మంది అమ్మాయిలని తమ స్వస్థలాలకు చేర్చేందుకు సోనూ సూద్ తన ఖర్చుతో ప్రైవేట్ జెట్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సోనూసూద్ ఇలా వలస కూలీలా కోసం సాయం అందిస్తుండగా కొందరు అతడిని వింతమైన కోరికలు కోరుతున్నారు. 

ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ ని కలవాలని కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మహిళ ట్విట్టర్ వేదికగా సోనూ సూద్ ని వింతైన కోరిక కోరింది. ' జనతా కర్ఫ్యూ నుంచి ప్రస్తుతం జరుగుతున్న లాక్ డౌన్ వరకు నేను, నా భర్త కలిసే ఉంటున్నాం. ఇకపై నేను నా భర్తతో కలసి ఉండలేను. నా భర్తని నా నుంచి దూరం చేయండి లేదా నన్నే నా పుట్టింటికి పంపండి అని కోరింది. 

దీనితో సోనూ సూద్ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. ఒక పని చేద్దాం..నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. మిమ్మల్నిద్దరిని గోవాకు ట్రిప్ కు పంపిస్తా అని ఆమెకు బదులిచ్చాడు. 

వలస కూలీలని అడుకుంటూ సోనూసూద్ ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల ఒడిశా సీఎం కూడా సోనూ సూద్ ని అభినందించాడు. తెలుగులో సోనూ సూద్ అతడు, జులాయి, అరుంధతి లాంటి చిత్రాల్లో నటించాడు. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?