‘మహానటి’ డైరక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్.. లేటెందుకు?

By Prashanth M  |  First Published Nov 15, 2019, 7:53 AM IST

చాలా సార్లు సరైన స్క్రిప్టు వర్క్ కూడా చేసుకోకుండా రంగంలోకి దూకేస్తూంటారు. ఓ ప్రక్కన రైటర్స్ తో చర్చిస్తూనే మరో ప్రక్క షూటింగ్ లాగించేస్తూంటారు. లేటు అయితే తమ క్రేజ్ తగ్గిపోతోందని భావించే దర్శకులకు విభిన్నంగా ఉన్నారు నాగ్ అశ్విన్.  ‘మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ అనిపించుకున్న ఆయన ఆ తర్వాత ఏ సినిమాను ప్రారంభించలేదు.


హిట్ సినిమా చేసిన దర్శకులు ఆ వెంటనే మరో సినిమా పెద్ద హీరోతో మొదలెట్టేస్తూంటారు. గ్యాప్ ఇవ్వటానికి ఇష్టపడరు. చాలా సార్లు సరైన స్క్రిప్టు వర్క్ కూడా చేసుకోకుండా రంగంలోకి దూకేస్తూంటారు. ఓ ప్రక్కన రైటర్స్ తో చర్చిస్తూనే మరో ప్రక్క షూటింగ్ లాగించేస్తూంటారు. లేటు అయితే తమ క్రేజ్ తగ్గిపోతోందని భావించే దర్శకులకు విభిన్నంగా ఉన్నారు నాగ్ అశ్విన్.  

మహానటి’ చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ అనిపించుకున్న ఆయన ఆ తర్వాత ఏ సినిమాను ప్రారంభించలేదు.    నాని, విజయ్ దేవరకొండలతో కలిపి చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు నాగ్ అశ్విన్. ఈ చిత్రం కమర్షియల్‌గా పేఆఫ్ కాకపోయినప్పటికీ కాలంతో పాటు నిలిచిపోయే సినిమాగా పేరు తెచ్చుకుంది.

Latest Videos

read also:ముదురు భామలతో కుర్ర హీరోలు.. హాట్ రొమాన్స్!

ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకుని అలనాటి స్టార్ హీరోయిన్ సావిత్రి జీవితం తీసుకుని ‘మహానటి’ అంటూ ఓ అద్బుతాన్ని ఆవిష్కరించాడు.  ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు మాత్రమే కాకుండా.. కమర్షియల్‌గానూ భారీ విజయాన్ని సాధించింది.  సినిమా చూసిన వారంతా సావిత్రికు ఇది నిజమైన నివాళి అంటూ ప్రశంసలు కురిపించారు. అనేక ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ ఈ సినిమా ప్రదర్శితం అయ్యి. ఎన్నో అవార్డు, రివార్డులు కూడా తెచ్చి పెట్టింది.  

ఈ క్రమంలో నాగ అశ్విన్ తో సినిమా చెయ్యటానికి పెద్ద పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోలు క్యూలు కట్టే స్దాయిలో ఉత్సాహపడ్డారు. కానీ నాగ అశ్విన్ మాత్రం కూల్ గా ఉన్నారు. ఓ స్క్రిప్టు పనిలో ఉన్నట్లు సమాచారం. తాను అనుకున్న స్టోరీ లైన్ తో ఓ సినిమా వస్తూన్నట్లు టంతో ఆ స్క్రిప్టుని పక్కన పెట్టి మరో కథను రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. అందుకే లేటైందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

సిమిలర్ స్టోరీ లైన్స్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు ఉంటాయని, అప్పుడు ఎవరైనా ఆ సబ్జెక్టుని ప్రక్కన పెట్టాల్సిందేనని అంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియాలి.  ప్రస్తుతం నాగ అశ్విన్ రెడీ చేస్తున్న కథ...ప్యాన్ ఇండియా సినిమా స్దాయిలో ఉండేలా  ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓ యూనిక్ కాన్సెప్ట్ ని తీసుకుని అన్ని భాషల వారిని, అన్ని తరాల వారిని అలరించేలా తియ్యాలని రోజుల తరబడి స్క్రిప్టుపై పనిచేస్తున్నారట.

తన రైటర్స్ టీమ్ తో డిస్కస్ చేస్తూ మెరుగులు దిద్దుతున్నారట. ఆ సబ్డెక్టు సోషియో ఫాంటసీ అని చెప్తున్నారు. కథ పూర్తయ్యాక హీరోల ఎంపిక ఉంటుందని, స్టార్ హీరోతో సినిమా ఉంటుందని చెప్తున్నారు. ఆ స్క్రిప్టు త్వరగా పూర్తయ్యి... తెరకెక్కాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

click me!