ట్రైలర్ లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్.. కానీ రొటీనే!

Published : Nov 12, 2019, 09:50 AM IST
ట్రైలర్ లో మాస్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్.. కానీ రొటీనే!

సారాంశం

ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని వదిలారు. ఈ ట్రైలర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. తెలుగు సినిమానే తమిళ రీమేక్ చూస్తున్నామా అనిపించింది. 

మాస్ సినిమాకు ఉండే క్రేజే వేరు. నటనతో ఎంత పేరు తెచ్చుకున్నా...జనాల్లోకు వెళ్లి నిర్మాతకు డబ్బు తెచ్చి పెట్టి, హీరోకు క్రేజ్ తెచ్చి పెట్టేవి మాస్ సినిమాలే. అందుకే ప్రతీ హీరో సాధ్యమైనంతవరకూ మాస్ సినిమాలు చేయాలనే చూస్తారు. అయితే విజయ్ సేతుపతి వంటి హీరోలు నటనతో మెప్పిస్తూ తనకంటూ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు పూర్తి కమర్షియల్ , మాస్ సినిమాపై దృష్టి పెట్టి చేసిన సినిమా  ''విజయ్ సేతుపతి''.

ఈ సినిమ తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ ట్రైలర్ ని వదిలారు. ఈ ట్రైలర్ మొత్తం మాస్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. తెలుగు సినిమానే తమిళ రీమేక్ చూస్తున్నామా అనిపించింది. విజయ్ సేతుపతి వంటి హీరోను ఇక్కడ చూడాలంటే ఏదన్నా స్పెషాలిటీ ఉండాలి. ట్రైలర్ రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో ఉంది. మీరూ ఓ లుక్కేయండి.

ఇక  'విజయ్ సేతుపతి' సినిమా కథను పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ కోసం రాశానని దర్శకుడు విజయ్ చందర్ చెప్పారు. పవన్ ..జనసేన పార్టీ పనుల్లో తీరిక లేకుండా ఉండటంతో ఆ కథను తమిళ్‌లో విజయ్ సేతుపతితో తీశానని పేర్కొన్నారు. రాశీ ఖన్నా, నివేదా పేతురాజ్‌ హీరోయిన్స్ గా నటించిన సినిమా ఇది. తమిళంలో ''సంగ తమిళన్'' పేరుతో రూపొందించారు. తెలుగులో ''విజయ్ సేతుపతి'' పేరుతో నవంబరు 15న విడుదల కానుంది. హర్షితా మూవీస్ పతాకంపై రావూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.  

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?