అలియా భట్ తో పార్టీ మూడ్ లో విజయ్ దేవరకొండ.. వైరల్ వీడియో!

Published : Nov 15, 2019, 08:12 PM ISTUpdated : Nov 15, 2019, 08:16 PM IST
అలియా భట్ తో పార్టీ మూడ్ లో విజయ్ దేవరకొండ.. వైరల్ వీడియో!

సారాంశం

అర్జున్ రెడ్డి చిత్రం విజయ్ దేవరకొండకు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్ర విజయం చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. 

అర్జున్ రెడ్డి మూవీలో విజయ్ దేవరకొండ నటనకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. మద్యానికి బానిసగా మారిన వైద్యుడిగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. అర్జున్ రెడ్డి చిత్రం హిందీ, తమిళ భషాల్లో రీమేకైన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. 

విజయ్ దేవరకొండ చాలా రోజులుగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో టచ్ లో ఉన్నాడు.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందనే ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా విజయ్ దేవరకొండ కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు. ఈ పార్టీకి సంబందించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

పార్టీలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ తారలు అలియా భట్, అర్జున్ కపూర్, జాక్వలిన్ లతో కలసి ఎంజాయ్ చేస్తున్న వీడియో అభిమానులని ఆకట్టుకుంటోంది. రానా కూడా పాల్గొన్నాడు. 

హాలీవుడ్ ప్రముఖ సింగర్ కెటి పెర్రీ మొట్టమొదటి సారి ముంబైలో పెర్ఫామ్ చేయబోతోంది. ఆమె కోసం కరణ్ జోహార్ ఈ పార్టీ ఏర్పాటు చేశాడు. కేటీ పెర్రీతో బాలీవుడ్ తారలు సందడి చేస్తున్నారు. మలైకా అరోరా, కరిష్మా కపూర్, కాజోల్ లాంటి ముద్దుగుమ్మలంతా ఈ పార్టీలో సందడి చేశారు. 

విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా విజయ్ ఓ చిత్రంలో నటించబోతున్నాడు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?