డైరెక్టర్ తో నయనతార ప్రేమకథకి ఐదేళ్లు!

Published : Feb 15, 2020, 02:55 PM IST
డైరెక్టర్ తో నయనతార ప్రేమకథకి ఐదేళ్లు!

సారాంశం

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రేమ గురించి విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నయనతారతో సన్నిహితంగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసి.. ఐదేళ్ల బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి ప్రస్తావించాడు. 

తమ ప్రేమకథ ఐదేళ్లను పూర్తి చేసుకుందని దర్శకుడు విఘ్నేశ్ శివన్ ప్రకటించాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తమ ప్రేమ గురించి విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నయనతారతో సన్నిహితంగా ఉన్న ఫోటోని పోస్ట్ చేసి.. ఐదేళ్ల బ్యూటిఫుల్ మూమెంట్స్ గురించి ప్రస్తావించాడు.

ఇప్పటికే వీరి ప్రేమకథ ఓపెన్ గా సాగుతోంది. ప్రతీ సందర్భాన్ని ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే దేవాలయాల సందర్శన కూడా చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. నయనతార, విఘ్నేశ్ శివన్ ల పెళ్లి గురించి ఇప్పటికే చాలా సార్లు ఊహాగానాలు, వార్తలు వినిపించాయి.

అలానే బ్రేకప్ వార్తలు కూడా వచ్చాయి. కానీ అలా ఏం జరగలేదు. తమ ప్రేమలో ఐదో వాలైంటైన్స్ డేని జరుపుకొని తమ బంధాన్ని చాటుకున్నారు. ''ఐదేళ్లు నా ప్రపంచంలో అంతా నువ్వే ఉన్నావ్‌. నీ ప్రేమానురాగాలతో నాకు ప్రతిరోజు వాలైంటైన్స్‌ డేనే. హ్యాపీ వాలెంటైన్స్‌ డే నా ప్రియమైన నయన్‌'' అంటూ విఘ్నేశ్ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?