వెంకీమామ ప్రమోషన్స్.. రిలీజ్ పై క్లారిటీ ఇవ్వరా?

Published : Nov 06, 2019, 02:45 PM ISTUpdated : Nov 06, 2019, 02:49 PM IST
వెంకీమామ ప్రమోషన్స్.. రిలీజ్ పై క్లారిటీ ఇవ్వరా?

సారాంశం

చిత్ర యూనిట్ పోస్టర్స్ తో హడావుడి చేస్తోంది గాని సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం పక్కా సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఇక ఆ సంగతి పట్టించుకోకుండా సినిమా సాంగ్స్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అసలైతే ఈ సినిమా దసరాకు రిలీజ్ కావాల్సింది.

వెంకిమామ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర యూనిట్ పోస్టర్స్ తో హడావుడి చేస్తోంది గాని సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం పక్కా సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఇక ఆ సంగతి పట్టించుకోకుండా సినిమా సాంగ్స్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

అసలైతే ఈ సినిమా దసరాకు రిలీజ్ కావాల్సింది.  కానీ పెద్ద సినిమాల ఎఫెక్ట్ తో ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చిన సురేష్ బాబు ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాని విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నారు. సినిమా బడ్జెట్ అయితే గట్టిగానే పెరిగింది. ఇకపోతే సినిమాకు సంబందించిన మొదటి సాంగ్ ని రేపు విడుదల చేయబోతున్నారు.

రూమర్స్ ప్రకారం వెంకిమామ సినిమాను జనవరి 25 తరువాత రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు ఒక ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్స్ సమస్యతో పాటు సినిమా బడ్జెట్ కూడా కాస్త కంగారుపెడుతోంది.మొదట వెంకీ మామ సినిమాను 30కోట్ల లోపే పూర్తి చేయాలనీ అనుకున్న సురేష్ బాబు ఆ తరువాత 40కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.

దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ రాబట్టాలి.పాజిటివ్ టాక్ వచ్చినా ;కూడా ఈ రోజుల్లో పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు. సో రిస్క్ లేకుండా జనవరి ఎండ్ లో సినిమాను రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు కొత్త డేట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?