వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్‌: అల్లుడికి వేట నేర్పుతున్న మామ

Published : Oct 08, 2019, 11:56 AM ISTUpdated : Oct 08, 2019, 12:20 PM IST
వెంకీమామ ఫస్ట్ గ్లింప్స్‌: అల్లుడికి వేట నేర్పుతున్న మామ

సారాంశం

దగ్గుబాటి మామ వెంకటేష్ - అక్కినేని అల్లుడు నాగ చైతన్య మొదటిసారి బిగ్ స్క్రీన్ పై చేయబోతున్న రచ్చ  ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. వెంకీ మామ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అంచనాల తగ్గట్టుగా ఎట్రాక్ట్ చేసింది.

దగ్గుబాటి మామ వెంకటేష్ - అక్కినేని అల్లుడు నాగ చైతన్య మొదటిసారి బిగ్ స్క్రీన్ పై చేయబోతున్న రచ్చ  ఏ రేంజ్ లో ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు. వెంకీ మామ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ ని విడుదల చేసిన చిత్ర యూనిట్ అంచనాల తగ్గట్టుగా ఎట్రాక్ట్ చేసింది. మామ అల్లుళ్ళ యాక్షన్ అండ్ కామెడీ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అన్ని వర్గాల ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా కష్టపడినట్లు తెలుస్తోంది.

"గోదావరిలో ఈత నేర్పించా.. బరిలో ఆట నేర్పా.. ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా.. రారా..అల్లుడు" అంటూ మామ వెంకటేష్ హై వోల్టేజ్ డైలాగ్ తో మంచి కిక్ ఇచ్చాడు. అలాగే లాస్ లో తనలో కామెడీ టైమింగ్ ని కూడా ప్రజెంట్ చేశాడు. ఇక విజువల్స్ లో పూర్తిగా విలేజ్ లోలేషన్స్ ని అందంగా ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఫైనల్ గా సినిమా గ్లింప్స్‌ పాజిటివ్ వైబ్రేషన్ ని క్రియేట్ చేసింది. సురేష్ ప్రొడక్షన్ లో సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?