ప్రభుత్వాలకు వెంకీ కృతజ్ఞతలు.. ఇంకా వైరస్ అంతం కాలేదు, జాగ్రత్త..

By tirumala ANFirst Published Jun 2, 2020, 3:50 PM IST
Highlights

విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ప్రస్తుతం వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో నారప్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

విక్టరీ వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. ప్రస్తుతం వెంకటేష్ ఎక్కువగా మల్టీస్టారర్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో నారప్ప అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. 

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరల్ ప్రభావం ఇంకా తగ్గలేదు. అయినా కూడా ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనల్ని సడలిస్తున్నాయి. తాజగ్గా విక్టరీ వెంకటేష్ ట్విట్టర్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపాడు. దాదాపు 70 రోజులుగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమించాయని వెంకటేష్ అన్నాడు. 

Stay Safe and continue to practice social distancing!! pic.twitter.com/0Jl3qcGNhz

— Venkatesh Daggubati (@VenkyMama)

పోలీసులు ఇతర సిబ్బంది ముందుండి కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ధైర్యంగా విధులు నిర్వహించారు అని వెంకటేష్ కొనియాడారు. కానీ ప్రజలని హెచ్చరించారు. ప్రస్తుతం నెమ్మదిగా గేట్లు ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మనం ఇంకా బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలి. 

లాక్ డౌన్ మాత్రమే ముగుస్తోంది.. కరోనా వైరస్ ఇంకా అంతం కాలేదు అని వెంకటేష్ ప్రజలని హెచ్చరించారు. సామజిక దూరాన్ని పాటిస్తూనే ఉండండి అని వెంకటేష్ ట్విట్టర్ లో అభిమానులని కోరాడు. 

click me!