వెంకీ సినిమా ఆగిపోలేదు.. నారప్ప తరువాత అదే!

By Prashanth MFirst Published Feb 5, 2020, 11:38 AM IST
Highlights

మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. 

గత ఏడాది రెండు మల్టీస్టారర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది మాత్రం సింగిల్ గానే రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్తగా నారప్ప అనే సినిమాతో సిద్దమవుతున్నాడు. తమిళ్ సినిమా అసురన్ సినిమాకు రీమేక్ గా వస్తోన్న ఆ సినిమాను శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు.  ఇకపోతే వెంకిమామ సినిమాకంటే ముందే వెంకీ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నాడు.

కానీ అప్పటికి ఫుల్ స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో వెంకీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయలేకపోయాడు. గతంలో ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లు టాక్ వచ్చింది. కానీ అది నిజం కాదు. ప్రస్తుతం తరుణ్ చెన్నైలో కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. సురేష్ బాబు ప్రొడక్షన్ లోనే ఆ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. హార్స్ రేస్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది.  ఆ సినిమాతో పాటు వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది.

నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కినతో ఒక సినిమా చేయాలనీ అనుకుంటున్నారు. అలాగే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు గతంలో ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇక తేజతో చేయాల్సిన ప్రాజెక్ట్ పట్టాలెక్కిన కొన్ని రోజులకే ఆగిపోవడంతో తేజతో మరో కొత్త తరహా సినిమా చేయాలనీ అనుకున్నారు. కానీ వెంకీ మాత్రం ఎవరు ఊహించని విధంగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. నారప్ప ప్రాజెక్ట్ కూడా ఇటీవల అనుకున్నదే. మరీ ఈ సినిమాతో విక్టరీ హీరో ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

click me!