విరాట్ కోహ్లీ, ధోని సన్నిహితుడితో వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ?

Published : May 20, 2020, 09:45 AM IST
విరాట్ కోహ్లీ, ధోని సన్నిహితుడితో వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం ?

సారాంశం

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ మల్టీటాలెంటెడ్ హీరోయిన్. ఆమె ధైర్యశాలి కూడా. తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్పగలదు.

ప్రముఖ నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ మల్టీటాలెంటెడ్ హీరోయిన్. ఆమె ధైర్యశాలి కూడా. తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్పగలదు. హీరోయిన్ గా మాత్రమే కాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా వరలక్ష్మి నటిస్తోంది. నటనలో తిరుగులేని ప్రతిభ కనబరుస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా వరలక్ష్మి కేంద్రంగా రూమర్లు కూడా ఎక్కువవే. ఆమె ప్రేమ వ్యవహారాల గురించి గతంలో అనేక పుకార్లు వినిపించాయి. తాజాగా అందరిని ఆశ్చర్యానికి గురిచేసే రూమర్ వైరల్ అవుతోంది. లాక్ డౌన్ తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తన ప్రియుడిని వివాహం చేసుకుకోబోతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 

ఆమె ప్రియుడి గురించి కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. క్రికెట్ తో సంబంధం ఉన్న ఓ బిజినెస్ మ్యాన్ తో వరలక్ష్మి శరత్ కుమార్ కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తోందని అంటున్నారు. ఆ వ్యక్తి టీమిండియా స్టార్ క్రికెటర్స్ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీలకు అత్యంత సన్నిహితుడని ప్రచారం జరుగుతోంది. దీనితో అభిమానులంతా వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రియుడెవరో గెస్ చేసే పనిలో ఉన్నారు. 

అయితే తన పెళ్లి గురించి వస్తున్న వార్తలని మాత్రం వరలక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఖండించింది. నాకు తెలియకుండా నా పెళ్లి ఎప్పుడు ఫిక్స్ అయిందో అర్థం కావడం లేదు అంటూ సెటైర్లు వేసింది. ఒక వేళ నిజంగానే నా పెళ్లి ఫిక్స్ అయితే టాపు లేచిపోయేలా గట్టిగా అరచి అందరికి చెబుతా. ప్రస్తుతానికి నేను పెళ్లి చేసుకోవడం లేదు.. సినిమాలు వదిలిపెట్టడం లేదు అని వరలక్ష్మి తనపై వస్తున్న రూమర్లని ఖండించింది. 

 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?