తెలుగు టీవీ సీరియల్ నటుడికి కరోనా, అన్ని షూటింగులు ఇక బంద్?

By Sreeharsha GopaganiFirst Published Jun 24, 2020, 8:16 AM IST
Highlights

ఒక ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే రెండు సీరియల్స్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఒక నటుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... ఆ సీరియల్ సెట్లోని నటులు, సిబ్బంది అంతా భయాందోళనలకు గురయ్యారు. వారు షూటింగులు నిర్వహించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. 

తెలుగు టీవీ షూటింగులు ఈ మధ్యనే ప్రారంభమయ్యాయి. ప్రతి ఛానల్ లో కూడా ఈ సోమవారం నుంచి సీరియల్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ ఇంతలోనే సీరియల్ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేగడంతో తాత్కాలికంగా కొన్ని రోజులపాటు షూటింగులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. 

ఒక ప్రముఖ టీవీ ఛానెల్లో ప్రసారమయ్యే రెండు సీరియల్స్ లో కీలక పాత్ర పోషిస్తున్న ఒక నటుడికి కరోనా పాజిటివ్ అని తేలడంతో... ఆ సీరియల్ సెట్లోని నటులు, సిబ్బంది అంతా భయాందోళనలకు గురయ్యారు. వారు షూటింగులు నిర్వహించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. 

మంగళవారం నాడు షూటింగ్ జరుగుతుండగా ఆ సదరు నటుడు జ్వరం తో బాధపడుతూ ఉండడాన్ని సీరియల్ బృందం గమనించింది. వారు అనుమానం వచ్చి అతడికి టెస్ట్ నిర్వహించారు. అతడికి టెస్టులో పాజిటివ్ అని తేలడంతో... షూటింగ్ ను నిలిపివేసి యూనిట్ సభ్యులందరినీ క్వారంటైన్ కి తరలించారు. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో టీవీ సీరియళ్ల చిత్రీకరణలను నిలిపేయాలని తెలుగు టెలివిజన్‌ టెక్నీషియన్స్‌, వర్కర్స్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం నుంచి షూటింగులకు వెళ్లకూడదని అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని గుసగుసలు వినబడుతున్నాయి. 

నిర్మాతలతో చర్చలు జరిపాక ఇతర వివరాలు తెలియజేస్తామని చెప్పారు. బుధవారం టీవీ సీరియళ్ల నిర్మాతలు సమావేశమై ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలియవస్తుంది. 

లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తరువాత ప్రభుత్వం షూటింగులకు అనుమతులిచ్చిన విషయం తెలిసిందే.  షూటింగులను నిర్వహించామని చెప్పినప్పటికీ... లా షూటింగులను నిర్వహించడం కష్టసాధ్యమవుతోందని యూనిట్ సభ్యులు అంటున్నారు. 

ఇకపోతే.... తెలంగాణలో కరోనా విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కొత్తగా 879 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,533కి చేరింది.

నిన్న తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 220కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,109 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా... 4,224 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

నిన్నొక్కరోజే హైదరాబాద్‌లోని 652 కేసులు నమోదవ్వగా.. మేడ్చల్‌లో 112, రంగారెడ్డిలో 64, కామారెడ్డి 10, వరంగల్ అర్బన్‌లో 9, జనగాంలో 7, వరంగల్ రూరల్, నాగర్‌కర్నూల్‌ నాలుగేసి కేసులు, మెదక్‌, మహబూబాబాద్, సంగారెడ్డి, మంచిర్యాలలో రెండేసీ కేసులు నమోదయ్యాయి. 

click me!