ఆంద్రప్రదేశ్ రాజధాని వివాదం.. సినీ రచయిత షాకింగ్ కామెంట్స్

By Prashanth MFirst Published Dec 23, 2019, 10:07 PM IST
Highlights

రాజధానికి సంబందించిన వివాదాలు రోజుకొకటి మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో ప్రతిపక్ష నేతలు ఊహించని విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ సభ్యులు సైతం ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. 

ఆంద్రప్రదేశ్ రాజధానికి సంబందించిన వివాదాలు రోజుకొకటి మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వం రాజధాని విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో ప్రతిపక్ష నేతలు ఊహించని విధంగా విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీపై అధికార పార్టీ సభ్యులు సైతం ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

గత ఎన్నికల నుంచి వైసిపి పార్టీకి మద్దతు అందిస్తున్న సినీ రచయిత చిన్న కృష్ణ కూడా వైసిపికి మద్దతు పలుకుతూ టీడీపీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఈ విధంగా వివరణ ఇచ్చారు. ' దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఏదైనా ఉందా అంటే అది అమరావతిపైనే కొనసాగింది. అభివృద్ధి అనేది ఒక ప్రాంతానికే పరిమితం చేస్తే ఇలాంటి వివాదాలే తలెత్తుతాయని హైదరాబాద్ విషయంలో అర్ధమయ్యింది.

జగన్ చెప్పినది చెప్పినట్టుగా తన పరిపాలనలో న్యాయబద్దంగా అమలు చేస్తున్నారు. చట్టాలు, అమలు, న్యాయాలు వివిధ ప్రాంతాల్లో ఉండడం కంటే ఒకే చోట ఉండటం మంచిది. అందులో ఎలాంటి తప్పు లేదు. విశాఖ అందమైననగరం రడజధానికి అది సరైన ప్రదేశం.  అమరావతిలో రాజదాని నిర్మించడానికి వెయ్యి ఎకరాలు సరిపోతుంది. 33 వేల ఎకరాలు అవసరం లేదు. రాజధాని కట్టడం సినిమాలో గ్రాఫిక్స్ ద్వారా మాత్రమే సులభం అవుతుంది.

రాజకీయాల్లో అది కుదరని పని. ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకొని రైతులు వారి భూములను వెనక్కి తీసుకోవాలి. చిరంజీవి లాంటి వారు మూడు రాజధానుల విషయంలో సీఎంని కలుసుకొని ప్రశంసించడం స్వాగతిస్తున్నాం. చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి. ఆయన లాంటి వ్యక్తిపై బురదజల్లే ప్రయత్నం చేస్తే తిరిగి అది వారిపైనే పడుతుంది' అని చిన్ని కృష్ణ వివరించారు.

click me!