చిరంజీవి గారి ఇంట్లో పెట్టుకుంటే అభ్యంతరం లేదు.. బాలయ్యకు గౌరవం ఇవ్వాలి

By tirumala ANFirst Published May 29, 2020, 4:32 PM IST
Highlights

టాలీవుడ్ లో మరోసారి ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు బయట పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలన్నీ రెండు నెలల క్రితమే మూతబడ్డ సంగతి తెలిసిందే.

టాలీవుడ్ లో మరోసారి ఆధిపత్య పోరు, గ్రూపు రాజకీయాలు బయట పడ్డాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ కార్యకలాపాలన్నీ రెండు నెలల క్రితమే మూతబడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వాలు క్రమంగా లాక్ డౌన్ ని కొన్ని నిబంధనలతో సడలిస్తున్న సంగతి తెలిసిందే. 

దీనితో సినిమా కార్యకలాపాలకు కూడా అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ఇటీవల సినిమా ప్రముఖుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి రాజమౌళి, నాగార్జున, త్రివిక్రమ్, కొరటాల శివ  లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. 

అయితే ఇటీవల బాలయ్య సినీ ప్రముఖుల సమావేశం గురించి తనకు తెలియదని.. అందరిలాగే వార్తల్లో చూసి తెలుసుకున్నానని అన్నారు. ఆ సమావేశానికి నన్నెవరూ ఆహ్వానించలేదని కూడా బాలయ్య వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా కూర్చుని భూములు పంచుకుంటున్నారా అని  ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాలయ్య వ్యాఖ్యలతో టాలీవుడ్ లో దుమారం రేగుతోంది. 

బాలకృష్ణ కామెంట్స్ కు నాగబాబు కౌంటర్ ఇస్తూ.. మీరు కింగ్ కాదు కేవలం హీరో మాత్రమే అని అన్నారు. ఇది పెద్ద రగడగా మారుతోంది. తాజాగా ప్రముఖ నిర్మాత ప్రసన్న కుమార్ ఈ ఇష్యూలో బాలయ్యని సపోర్ట్ చేస్తూ చిరంజీవి విమర్శించారు. బాలకృష్ణగారిని సమావేశానికి ఆహ్వానించకపోవడం తప్పు. అయన కేవలం హీరో మాత్రమే కాదు. ఛాంబర్ లోని ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్ కూడా. 

చిరంజీవి గారి ఇంట్లో సమావేశం పెట్టుకుంటే నాకేం ఇబ్బంది లేదు. కానీ అందరిని గౌరవించాల్సిన భాద్యత ఉంది అని ప్రసన్న కుమార్ అన్నారు. కొత్తగా టాలీవుడ్ లో మొదలైన ఈ ఆధిపత్య పోరు ఎంతవరకు వెళుతుందో మరి. 

click me!