గీతాంజలికి మా అసోసియేషన్ ఘన నివాళి

By Prashanth MFirst Published Oct 31, 2019, 11:21 AM IST
Highlights

గీతాంజలి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ మొదటి సీతగా కనిపించింది మాత్రం గీతాంజలి గారే. జనాల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న ఆమె గుండెపోటుతో గురువారం మరణించారు. 

సీనియర్ నటి గీతాంజలి మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. రామాయణం బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ మొదటి సీతగా కనిపించింది మాత్రం గీతాంజలి గారే. జనాల్లో సీతగా చెరగని ముద్ర వేసుకున్న ఆమె గుండెపోటుతో గురువారం మరణించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీనియర్ నటి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పిస్తున్నారు.  ఇక మా అసోసియేషన్ సభ్యులు కూడా ఆమెకు ఘన నివాళులర్పించారు.

మా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ.. నేడు సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. మా తల్లి విజయనిర్మల గారితో ఆమెకు మంచి అనుబంధం ఉంది. ఆమె నటిగా ఎంతో గుర్తింపు దక్కించుకున్నారో ప్రత్యేకంగా నేను చెప్పలేను. సౌత్ లోనే కాకుండా హిందీలో కూడా నటించారు. మా అసోసియేషన్ తో ఆమె నిత్యం మంచి చెడుల్లో తన ఆలోచనలను అందించేవారు. అందరితో నవ్వుతు కలిసి మాట్లాడే వారని నరేష్ వివరణ ఇచ్చారు.  నందినగర్‌లోని గీతాంజలి నివాసానికి ప్రస్తుతం టాలీవుడ్‌ నటులు వెళుతున్నారు.

కడసారి ఆమె పార్థివదేహాన్ని చూసి నివాళులు అర్పిస్తూ... గీతాంజలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.   62 ఏళ్ల గీతాంజలి ఎన్టీఆర్ - ఏఎన్నార్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించారు. 1961లో ఆమె మొదటిసారి తొలిసారిగా సీతారామ కళ్యాణం చిత్రం ద్వారా ఆమె సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ సినిమాలో సీతగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం సినీ కెరీర్ లో గీతాంజలి వెనక్కి తిరిగి చూసుకోలేదు.

డాక్టర్ చక్రవర్తి, బొబ్బిలియుద్దం, దేవత, గూఢచారి 116 వంటి ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో నటించారు.  పాత్ర ఏదైనా తన నటనతో సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేవారు, శ్రీశ్రీ మర్యాద రామన్న, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలువంటి సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు కూడా చాలా బాగా క్లిక్కయ్యాయి.  ఇక 1972 తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. 20 ఏళ్ల అనంతరం మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చి పెళ్ళైన కొత్తలో - మొగుడు - గ్రీకు వీరుడు వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. తెలుగులో 33 సినిమాల్లో నటించిన గీతాంజలి హిందీ తమిళ్ మలయాళం సినిమాలతో కలిపి మొత్తంగా 50కి పైగా సినిమాల్లో ఆమె నటించారు.

also read ఆ దెబ్బతో సినిమాలకు దూరమైన గీతాంజలి.. అన్నగారు చెప్పినా వినకుండా..

click me!