మరో షాకింగ్ న్యూస్: మెగా హీరో వరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్

Published : Dec 29, 2020, 04:37 PM IST
మరో షాకింగ్ న్యూస్: మెగా హీరో వరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్

సారాంశం

మెగా కుటుంబంలో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మెగా హీరో వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది.

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మరో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో మెగా హీరో వరణ్ తేజ్ కు కరోణా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. 

ఈ రోజు ఉదయం తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు కనిపించాయని వరణ్ తేజ్ ట్వీట్  చేశారు. తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లు కూడా తెలిపారు. తాను తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, త్వరలోనే కోలుకుంటానని ఆయన చెప్పారు. తన పట్ల చూపుతున్న ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

 

ఇదిలావుంటే, తెలుగు సినీ హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. గత రెండు రోజులుగా తనను కలిసినవారు కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఆయన కోరారు. 

మంగళవారం ఉదయం రామ్ చరణ్ తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న విషయాన్ని త్వరలో తాను తెలియజేస్తానని ఆయన చెప్పారు. 

నాలుగు రోజుల క్రితం రామ్ చరణఅ కుటుంబ సభ్యులతో క్రిస్ట్మస్ వేడుకలు జరుపుకున్నారు. వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిన  అవసరం ఉంటుందని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆచార్య సెట్ కు కూడా వెళ్లారు. 

దర్శకుడు కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేషన్ సెల్వరాజ్ లను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ సేవిస్తూ ఆయన అందరినీ పలకరించారు. దాంతో వారందరిలోనూ టెన్షన్ నెలకొంది.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?