‘కీడాకోలా’OTT రిలీజ్ డేట్,డిటేల్స్

By Surya Prakash  |  First Published Nov 5, 2023, 1:23 PM IST

. ‘పెళ్లిచూపులు’ సినిమాతో పరిచయమైన తరుణ్ భాస్కర్.. తొలి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తరవాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతోనూ...



 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో యూత్ లోకి దూసుకుపోయిన దర్శకుడు తరుణ్ భాస్కర్(Tharun Bhascker) చాలా గ్యాప్ తర్వాత తన మూడో సినిమా ‘కీడా కోలా’(Keeda Cola)తో వచ్చాడు. ఈ శుక్రవారం రిలీజైన ఈ క్రైం కామెడీ థ్రిల్లర్ ఓ వర్గానికి బాగానే ఎక్కింది. అయితే అందరినీ అలరించలేకపోయింది. దాంతో డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు ఫుల్ కామెడీగా చెప్తుంటే మరికొందరు కథేమి లేదని పెదవి విరిచేస్తున్నారు. ఈ నేపధ్యంలో కొందరు ఓటిటి సినిమా అని తేలుస్తున్నారు. అది ప్రక్కన పెడితే ఓటిటిలో ఎప్పుడు వస్తుంది..ఏ ఓటిటిలో రిలీజ్ అవుతుందనేది సినీ లవర్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా రైట్స్ ని ఆహా వారు సొంతం చేసుకున్నారు.  నవంబర్ 3న రిలీజ్ అయిన ఈ చిత్రం నెల రోజుల్లో అంటే డిసెంబర్ మొదటి వారంలో ఓటిటిలో రానుందని సమాచారం. యూత్ ని టార్గెట్ చేసిన ఈ  కీడా కోలా సినిమా ఓటిటిలోనూ బాగా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

Latest Videos

మరో ప్రక్కన తక్కువ బడ్జెట్ లో అందరు చిన్న ఆర్టిస్టులతోనే తీసిన ఈ సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేసింది. కీడా కోలా సినిమా మొదటి రోజే 6 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాగా రెండు రోజుల్లో ఈ సినిమా 9.72 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్టు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక నేడు ఆదివారం కావడంతో మరిన్ని కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు. 

తరుణ్ భాస్కర్ సినిమాని ముందుండి చాలా కొత్తగా ప్రమోషన్స్ కూడా చేశాడు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కూడా చేశాడు. కీడాకోలా సినిమాలో బ్రహ్మానందం, ’30 వెడ్స్ 21′ ఫేమ్ చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.
 

click me!