'ఇఫీ' లో ఆల్ టైమ్ క్లాసిక్ ఎన్టీఆర్ 'వరకట్నం'!

By AN TeluguFirst Published Nov 14, 2019, 12:17 PM IST
Highlights

గోవాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఈనెల 20 నుంచి 28 వరకూ  జరుగనుంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ప్రదర్శించనున్నారు. 

ఎన్.టి.ఆర్. స్వీయ దర్శకత్వం వహించి, ఆయన సోదరుడు త్రివిక్రమరావు నిర్మాణ సారథ్యంలో రూపొందించిన చిత్రం  “ వరకట్నం’’. అప్పటి పరిస్దితుల్లో కుటుంబాలను ఇబ్బందిపెడుతున్న వరకట్న దురాచారాన్ని దుయ్యపడతూ రూపొందిన ఈ చిత్రం ఆయన కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఇప్పుడీ చిత్రం గోవాలో జరగనున్న  'ఇఫీ' ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. 'వరకట్నం' చిత్రం ప్రజాభిమానంతోపాటు విజయవంతమైన చిత్రంగా నిలిచింది. 'బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ ఇన్ తెలుగు'గా నేషనల్ ఫిలిమ్ అవార్డ్ పొందింది.

ముదురు భామలతో కుర్ర హీరోలు.. హాట్ రొమాన్స్!

అలాగే కుటుంబ కథా చిత్రాల నిర్మాతగా, దర్శకునిగా యన్‌టి రామారావుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.1969 జనవరి 9వ తేదీన విడుదలై ఈ చన చిత్రంలో ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, సత్యనారాయణ, సావిత్రి, రాజనాల, నాగభూషణం, మిక్కిలినేని తదితరులు నటించారు. సైసై జోడెడ్లబండి బండి హో షోకైన దొరలబండి, మరదల మరదల తమ్ముని పెళ్ళామా ఏమమ్మా , ఇదేనా మన సంప్రదాయమిదేనా పాటలు అత్యంత ప్రజాదరణ పొందినవి.
 
గోవాలో ప్రతిష్ఠాత్మకంగా జరుగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) ఈనెల 20 నుంచి 28 వరకూ  జరుగనుంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ గోల్డెన్‌జుబ్లీ సినిమా పండుగలో రష్యా భాగ్యస్వామ్య దేశంగా ఉండనున్నది. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు పొందిన అమితాబ్‌బచ్చన్‌ గౌరవార్ధం ఆయన నటించిన 7-8 ప్రముఖ చిత్రాలను ప్రదర్శించనున్నారు. భారతీయ భాషలకు చెందిన 26 చలన చిత్రాలు, 15 డాక్యుమెంటరీలు ప్రదర్శనకు ఎంపిక అయ్యాయని చెప్పారు. యూరి, సూపర్‌ 30, బదాయి హో, గల్లీ బాయ్‌, జల్లికట్టు వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలు ఇందులో ఉన్నట్లు తెలిపారు. గుజరాతీ డాక్యుమెంటరీ ‘హెల్లారో’ను మొదటగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.

50 ఏండ్ల నాటి 12 ప్రముఖ సినిమాలతోపాటు ఈ చిత్రోత్సవంలో తొలిసారి వినికిడిలోపం ఉన్న దివ్యాంగుల కోసం ఆడియో చిత్రాలను ప్రదర్శించనున్నారు. అలాగే దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు 'ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ' అవార్డును ఈ సందర్భంగా ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలో సుమారు 12 వేల మంది డెలిగేట్స్‌, 500లకుపైగా సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉంటే, మహిళలకు పెద్ద పీఠ వేస్తూ 50 మంది మహిళా దర్శకులు రూపొందించిన చిత్రాలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయటం గోల్డెన్‌జూబ్లీ వేడుకకి హైలైట్‌గా నిలవనుంది.

click me!