తేజ డబుల్ ధమాకా.. ఒకేసారి ఇద్దరు హీరోలతో!

Published : Feb 22, 2020, 07:27 PM IST
తేజ డబుల్ ధమాకా.. ఒకేసారి ఇద్దరు హీరోలతో!

సారాంశం

డైరెక్టర్ తేజ మరోసారి ఎవరు ఊహించని ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశాడు. ప్రేమ కథల ఫార్మాట్ ని పక్కనపెట్టి నేటి తరానికి తగ్గట్టుగా డిఫరెంట్ స్క్రిప్ట్ లను తెరకెక్కిస్తున్నాడు, ఇక ఒకేసారి రెండు విభిన్నమైన టైటిళ్లను ఎనౌన్స్ చేసి హీరోల పేర్లను కూడా రివీల్ చేశాడు. 

సీనియర్ డైరెక్టర్ తేజ మరోసారి ఎవరు ఊహించని ప్రాజెక్టులను ఎనౌన్స్ చేశాడు. ప్రేమ కథల ఫార్మాట్ ని పక్కనపెట్టి నేటి తరానికి తగ్గట్టుగా డిఫరెంట్ స్క్రిప్ట్ లను తెరకెక్కిస్తున్నాడు, ఇక ఒకేసారి రెండు విభిన్నమైన టైటిళ్లను ఎనౌన్స్ చేసి హీరోల పేర్లను కూడా రివీల్ చేశాడు. అందులో ఒక కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాడు.

తేజ శనివారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.  ఈ ప్రత్యేక సందర్భంలో, ఆయన తన తదుపరి రెండు సినిమాల టైటిళ్లనూ, వాటి హీరోలనూ ప్రకటించారు. ఒక మూవీలో గోపీచంద్, మరో సినిమాలో రానా హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాల కోసం ఆయన 'రాక్షస రాజు రావణాసురుడు', 'అలిమేలు మంగ వెంకట రమణ' అనే ఆసక్తికర టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. అయితే, ఆసక్తికరమైన విషయమేమంటే, హీరోలు సహా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ఈ సినిమాల పోస్టర్లను తేజ విడుదల చేశారు.

దాంతో రానాతో చేసే మూవీ ఏది? గోపీచంద్ నటించే సినిమా ఏది?.. అనే విషయాన్ని ఆయన ప్రస్తుతానికి సస్పెన్సులో ఉంచారు. ఈ సినిమాల నిర్మాతలనూ, వాటిలో నటించే తారాగణాన్నీ త్వరలోనే తేజ ప్రకటించనున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమాల స్క్రిప్టుల్ని పూర్తి చేశారు. 'జయం' చిత్రంతో గోపీచంద్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన తేజ, 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో రానాకు మరపురాని హిట్ ను అందించిన విషయం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?