రాజ్ కపూర్ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో 'షారుక్' పేరు వైరల్

prashanth musti   | Asianet News
Published : Feb 17, 2020, 09:58 PM ISTUpdated : Feb 17, 2020, 09:59 PM IST
రాజ్ కపూర్ ఇంట విషాదం.. సోషల్ మీడియాలో 'షారుక్' పేరు వైరల్

సారాంశం

హెడ్ లైన్స్ చూసి షాకవ్వడం కామన్ పాయింట్. అయితే వార్తల్లోకి పూర్తిగా వెళ్లకుండా టైటిల్ దగ్గరే ఆగిపోతే పొరబడినట్లే. కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలకు సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. 

వార్తల్లో హెడ్ లైన్స్ చూసి షాకవ్వడం కామన్ పాయింట్. అయితే వార్తల్లోకి పూర్తిగా వెళ్లకుండా టైటిల్ దగ్గరే ఆగిపోతే పొరబడినట్లే. కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాలకు సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. షారుక్ హఠాన్మరణంతో రాజ్ కపూర్ కపూర్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

అయితే ఇక్కడ షారుక్ అనే వ్యక్తి తమిళ్ డైరెక్టర్ రాజ్ కపూర్ కుమారుడు.    'తాలాట్టు కేట్కుదమ్మా' అనే సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని తమిళ్ లో బిజీగా మారిన దర్శకుడు రాజ్ కపూర్.. అజిత్‌ హీరోగా చేసిన అవర్‌ వరువాళా చిత్రానికి కూడా దర్శకత్వం వహించాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే.. గత ఏడాది నుంచి ఆయన కుమారుడు షారుక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.  ఇటీవల షారుక్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్ లో జాయిన్ చేశారు.

అయితే కొన్ని గంటలపాటు వైద్యులు అతన్ని బ్రతికించేందుకు శ్రమించినప్పటికీ లాభం లేకపోయింది. 21 ఏళ్ల షారుక్ తుది శ్వాస విడిచినట్లు తెలియగానే ఒక్కసారిగా తమిళ్ మీడియాలో వైరల్ గా మారింది. కొడుకును హీరోగా చేయాలనీ అనుకున్న రాజ్ కపూర్ ఆశలు కొన్నాళ్లకే ఆవిరైపోయాయి. కొడుకు మరణించడంతో తమిళ సినీ ప్రముఖులు రాజ్ కపూర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వారి స్వగృహానికి వెళుతున్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?