తమన్నా లిప్ లాక్ సీన్.. నా రూల్ మారదంటున్న మిల్కీ బ్యూటీ!

Published : Nov 12, 2019, 09:51 PM ISTUpdated : Nov 12, 2019, 09:52 PM IST
తమన్నా లిప్ లాక్ సీన్.. నా రూల్ మారదంటున్న మిల్కీ బ్యూటీ!

సారాంశం

మిల్కీ బ్యూటీ తమన్నా అందం, అభినయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మతిపోగోట్టే అందంతో తమన్నా కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. తమన్నాకు యువత విశేషమైన ఫాలోయింగ్ ఉంది. 

తమన్నా దశాబ్దకాలానికి పైగా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో కొనసాగుతోంది. తమన్నా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. తమన్నా రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి చిత్రం సైరాలో కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

సైరా చిత్రంలో తమన్నా పాత్రకు ప్రశంసలు దక్కాయి. నర్తకిగా తమన్నా అద్భుతమైన నటన కనబరిచింది. తమన్నా తన కెరీర్ లో ఐటెం సాంగ్స్ లో కూడా మెరిసింది. అల్లుడు శీను, జై లవకుశ లాంటి చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 

జైలవకుశ చిత్రంలో స్వింగ్ జర అనే పాటలో తమన్నా యువతని ఒకఊపు ఊపింది. యూట్యూబ్ లో ఇప్పటికి ఆ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోంది. తమన్నా వెండి తెరపై ఎంతగా గ్లామర్ ఒలకబోసినా తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుంది. తన 14 ఏళ్ల కెరీర్ లో తమన్నా ఇంతవరకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించలేదు. 

ప్రస్తుతం టాలీవుడ్ కమర్షియల్ చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశం కామన్ అయిపోయింది. స్టార్ హీరోయిన్లు సైతం ముద్దు సన్నివేశాల్లో నటిస్తున్నారు. కానీ తాను మాత్రం లిప్ లాక్ సీన్స్ లో నటించే ప్రసక్తే లేదు అని తమన్నా మరోమారు తేల్చి చెప్పేసింది. 

ముద్దు సన్నివేశాల్లో నటించకూడదనే తన రూల్ ని ఎట్టి పరిస్థితుల్లో బ్రేక్ చేయనని ఓ ఇంటర్వ్యూలో తమన్నా తెలిపింది. ప్రస్తుతం తమన్నా విశాల్ సరసన యాక్షన్ మూవీలో నటించింది. నవంబర్ 15న ఈ శుక్రవారం యాక్షన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సుందర్ సి దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?