ఆన్లైన్ లో 'సైరా' సినిమా.. రామ్ చరణ్ ఆగ్రహం!

By AN TeluguFirst Published Oct 4, 2019, 12:54 PM IST
Highlights

సినిమా రిలీజ్ కోసం ఎంత భారీ ఏర్పాట్లు చేశారో.. పైరసీని అరికట్టడం కోసం కూడా అదే స్థాయిలో భారీగా వర్క్ చేసింది మెగా కాంపౌండ్. 
 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా గాంధీజయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ దక్కించుకుంది. ఈ సినిమారిలీజ్ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. పైరసీని అరికట్టడం కోసం కూడా భారీగా వర్క్ చేశారు.

వీడియోలు మాత్రమే కాకుండా, చిన్న చిన్న స్క్రీన్ షాట్స్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొంతమంది అభిమానులు సరదాగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టిన స్క్రీన్ షాట్స్ కూడా డిలీట్ చేయించారు. కొన్ని అకౌంట్స్ సస్పెండ్ అయ్యాయి కూడా. ఇంత పక్కాగా అన్నీ చేసుకుంటూ వచ్చిన యూనిట్ తమిళరాకర్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయింది.

పైరసీకి అడ్డాగా మారిన తమిళ రాకర్స్ ఈ సినిమాను పైరసీ చేసి మొత్తం సినిమాను పైరసీ చేసి నెట్ లో అప్లోడ్ చేసేశారు. మార్నింగ్ షోలు ముగిసి, మధ్యాహ్నం షో కూడా ప్రారంభం కాకముందే 'సైరా' మొత్తం సినిమా పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. సాయంత్రమయ్యేసరికి ఆ లింక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో 'సైరా' యూనిట్ కి తలనొప్పి మొదలైంది.

పైరసీ లింక్స్ కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా ఓ ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసింది చిత్రబృందం. ఫ్యాన్స్ సహాయంతో ఆ మెయిల్ ఐడీ అందరికీ చేరేలా చేసింది. ఇప్పుడు ఆ మెయిల్ కి పైరసీ లింక్స్ చాలానే వస్తున్నాయి. ఎన్ని లింక్స్ ని తొలగిస్తున్నప్పటికీ తమిళరాకర్స్ బృందం మాత్రం రకరకాల సర్వర్ల నుండి రకరకాల వెబ్ సైట్స్ నుండి లింక్స్ ని తిరిగి అప్లోడ్ చేస్తూనే ఉంది. 

దీంతో రామ్ చరణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. సినిమా పైరసీపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నాడు. వీకెండ్ ముగిసేవరకు పైరసీ జరగకుండా ఆపాలని చిత్రబృందం భావించింది కానీ అది జరగడం లేదు. మరి దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి!


 

click me!