హీరోయిన్‌పై రాంగ్ న్యూస్‌.. ఫైర్‌ అయిన నటి

By Satish ReddyFirst Published Apr 27, 2020, 11:13 AM IST
Highlights

ఓ ప్రముఖ మీడియా సంస్థలో సుస్మితా సేన్‌, అనిల్ అంబానిలకు సంబంధించి ఓ వార్త వచ్చింది. అయితే ఈ వార్తపై సుస్మితా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఈ వార్తల్లొ ఒక్క శాతం కూడా నిజం లేదన్న సుస్మిత, సదరు సంస్ధపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది.

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన దగ్గర నుంచి సెల్రబిటీలకు సరికొత్త తల నొప్పులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వాళ్ల వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా ఫేక్‌ న్యూస్‌ ఆన్‌లైన్‌లో సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే పలు సందర్భాల్లో ఆ ఫేక్ వార్తలను ప్రముఖ మీడియా సంస్థలు కూడా ప్రచురించి ఇబ్బందుల పాలవుతుంటాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. బాలీవుడ్ సీనియర్ నటి సుష్మిత సేన్‌కు సంబంధించిన వార్త వివాదాస్పదమైంది.

ఓ ప్రముఖ మీడియా సంస్థలో సుస్మితా సేన్‌, అనిల్ అంబానిలకు సంబంధించి ఓ వార్త వచ్చింది. అయితే ఈ వార్తపై సుస్మితా ఘాటుగా రియాక్ట్ అయ్యింది. ఈ వార్తల్లొ ఒక్క శాతం కూడా నిజం లేదన్న సుస్మిత, సదరు సంస్ధపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడింది. మీరు జర్నలిజంకే మచ్చ అంటూ కామెంట్ చేసింది సుస్మిత. దీంతో సదరు సంస్థ ఈ వార్తను తొలగించింది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సుస్మిత ఏదో ఒక వార్తతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో ప్రస్తుతం డేటింగ్ చేస్తోంది ఈ బ్యూటీ. అయితే వీరి రిలేషన్‌కు సంబంధించిన చాలా వార్తలు వినిపించినా ఎప్పుడూ స్పందించిన సుస్మిత తాజాగా అంతగా రియాక్ట్ అవ్వటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

People like you are an embarrassment to journalism!!! Shame on you!! NOT A WORD OF TRUTH IN IT. While making a living don’t forget to make a life, one with some dignity in it!! God bless you!!https://t.co/GbnnbAwgM9 via

— sushmita sen (@thesushmitasen)
click me!