సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి అంత్యక్రియలు కూడా ఇంకా పూర్తికాకముందే... మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ మరణవార్త విని కృంగిపోయిన అతని వదిన కూడా ఆ దుఃఖాన్ని దిగమింగలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలను విడిచింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి అంత్యక్రియలు కూడా ఇంకా పూర్తికాకముందే... మరో విషాదం చోటుచేసుకుంది. సుశాంత్ మరణవార్త విని కృంగిపోయిన అతని వదిన కూడా ఆ దుఃఖాన్ని దిగమింగలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలను విడిచింది.
వివరాల్లోకి లోని సుశాంత్ సొంత గ్రామంలో నివసిస్తున్న అతడి కజిన్ సోదరి భార్య సుధా దేవి సుశాంత్ మరణ వార్త విని బాగా కృంగిపోయింది. ఎప్పుడు సుశాంత్ మొఖం మీద చిరునవ్వు తప్ప వేరే ఏమీ చూడని వదిన ఒక్కసారిగా అతడి మరణవార్తను జీర్ణించుకోలేకపోయింది.
undefined
ఆదివారం అతడి మరణ వార్త విన్నప్పటినుండి ఆమె ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. ఎప్పటినుండో కూడా ఆమె దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతుందని, సుశాంత్ మరణ వార్త ఆమెను మరింతగా బలహీనపరిచి మానసికంగా కృంగదీసిందని ఆమె కుటుంబసభ్యులు అన్నారు.
కాగా సుశాంత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. ఆ పోస్టుమార్టం నివేదికను వైద్యులు విడుదల చేశారు.
ఆ రిపోర్టు ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్య అని తేలింది. అయితే అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విషయం తెలిసిందే.
అతని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెషన్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మరోవైపు ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
నేడు నటుడి అంత్యక్రియలు జరగగనుండగా.. సుశాంత్ కుటుంబీకులు వారి స్వస్థలమైన పాట్నా నుంచి ముంబైకు పయనమయ్యారు. ఇదిలా వుండగా రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు.
అలా ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి" చిత్రాలు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా "చిచోరె" చిత్రంలో కనిపించాడు.