సుశాంత్ కేసులో సిబిఐ ఎంట్రీ: బీహార్ ఐపీఎస్ కి క్వారంటైన్ నుండి విముక్తి

By team teluguFirst Published Aug 7, 2020, 11:46 AM IST
Highlights

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సిబిఐ విచారణకు సుప్రీమ్ ఆదేశించిన నేపథ్యంలో, వారు విచారణను చేపట్టి రెండు రోజులయిన నేపథ్యంలో వినయ్ తివారీని మహారాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ నుండి విముక్తుణ్ణి చేసింది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం పై అనేక నీలి నీడలు;యూ కమ్ముకోవడంతో బీహార్ పోలీసులు సైతం ఈ కేసును సుశాంత్ తండ్రి కంప్లైంట్ ఆధారంగా విచారణ ప్రారంభించిన విషయం విదితమే. 

ఈ కేసుకు సంబంధించి బీహార్ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారి పాట్నా నుంచి నేరుగా ముంబై చేరుకున్నారు. ఆయన ముంబై చేరుకోగానే... కరోనా నిబంధనలు అంటూ బలవంతంగా క్వారంటైన్ కి తరలించారు ముంబై పోలీసులు. దీనిపై తీవ్ర వివాదం కూడా చెలరేగింది. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సిబిఐ విచారణకు సుప్రీమ్ ఆదేశించిన నేపథ్యంలో, వారు విచారణను చేపట్టి రెండు రోజులయిన నేపథ్యంలో వినయ్ తివారీని మహారాష్ట్ర ప్రభుత్వం క్వారంటైన్ నుండి విముక్తుణ్ణి చేసింది. 

ఇకపోతే సుశాంత్ సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తికి ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాక్‌ ఇచ్చింది. సుప్రీంకోర్ట్ తీర్పు వరకు ఈడీ తనపై విచారణను వాయిదా వేయాలన్న ఆమె కోరికని ఈడీ తిరస్కరించింది.

 సమన్లు పంపినట్టుగానే నేడు(శుక్రవారం) తమ ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. దీంతో రియాకి దిమ్మతిరిగిపోయింది. సుశాంత్‌ కేసులో మనీలాండరింగ్‌ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 

దాదాపు రూ.15కోట్లు సుశాంత్‌ అకౌంట్ల నుంచి రియా కొట్టేసిందని, దీనిపై విచారణ చేపట్టాలని సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. సుశాంత్‌ కేసు సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడు ఈడీ సైతం తమ విచారణ వేగవంతం చేసింది. అందులో భాగంగా సుశాంత్‌ ప్రియురాలు రియాని శుక్రవారం తమ ముందు హాజరు కావాలని మూడు రోజుల క్రితం సమన్లు జారీ చేసింది.

click me!