'హిరణ్యకశిప' బడ్జెట్ కోత.. నిర్మాత ముందు జాగ్రత్త!

By Prashanth MFirst Published Feb 22, 2020, 1:52 PM IST
Highlights

దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' అనే సినిమాను సెట్స్ పై తేవడానికి రానా గత కోనేళ్ళుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. హోమ్ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు సాయంతో సినిమాని 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.

బాహుబలి విలన్ దగ్గుబాటి రానా డ్రీమ్ ప్రాజెక్ట్ కి మరోసారి బ్రేకులు పడుతున్నట్లు తెలుస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప' అనే సినిమాను సెట్స్ పై తేవడానికి రానా గత కోనేళ్ళుగా తీవ్రంగా కష్టపడుతున్నాడు. హోమ్ బ్యానర్ లో తండ్రి సురేష్ బాబు సాయంతో సినిమాని 180కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించాలని అనుకున్నాడు.  గత మూడేళ్ళుగా సినిమాకు సంబందించిన డిస్కర్షన్స్ జరుగుతూనే ఉన్నాయి.

సురేష్ బాబు కూడా తన కొడుకుకి మంచి బాక్స్ ఆఫీస్ హిట్ ఇవ్వాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశ విదేశాల నుంచి హై లెవెల్ టెక్నీషియన్స్ తో చర్చలు కూడా జరిపారు. అయితే ఈ సమ్మర్ లో సినిమాని స్టార్ట్ చేయాలనుకున్న చిత్ర యూనిట్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకుందట. సినిమా బడ్జెట్ ని తగ్గించినట్లు తెలుస్తోంది.  మొదట 200కోట్లు అయినా సరే బడ్జెట్ లో వెనక్కి తగ్గకుండా మైథలాజికల్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్మించాలని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా చిత్ర యూనిట్ 100కోట్ల బడ్జెట్ లో సినిమాని నిర్మించాలని ప్లాన్ రెడీ చేసుకుందట.

సురేష్ బాబు డబ్బులు ఎక్కువగా వృధా కనివ్వరు అనేది అందరికి తెలిసిన విషయమే.  సొంత కొడుకు సినిమా అయినా.. ఆయన ఒక నిర్మాతగానే పొదుపుగా ఆలోచిస్తారని అర్ధమవుతోంది. ఇక సినిమాపై ఎక్కువగా రిస్క్ చేయకూడదని మేకింగ్ లో అవసరమైనంత బడ్జెట్ ని పెంచాలని నిర్ణయించుకున్నారట. ఇక గుణశేఖర్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఆయన చివరగా డైరెక్ట్ చేసిన రుద్రమదేవి పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కేవలం పెట్టిన బడ్జెట్ ని మాత్రమే వెనక్కి తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు పౌరాణిక సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.

click me!