రజినీకాంత్ చేసిన తప్పేంటి.. ఆ పోస్టును ట్విట్టర్ ఎందుకు డిలీట్ చేసింది?

By Prashanth MFirst Published Mar 23, 2020, 8:46 AM IST
Highlights

రజినీకాంత్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ చేసిన ఒక ట్వీట్ సడన్ గా మాయమయ్యింది. 

సూపర్ స్టార్ రజినీకాంత్ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ఉంటారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. రజినీకాంత్ వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వారి అభిమానాన్ని పొందుతున్నారు. అయితే రీసెంట్ గా సూపర్ స్టార్ చేసిన ఒక ట్వీట్ సడన్ గా మాయమయ్యింది. ట్విట్టర్ దాన్ని అధికారికంగా తొలగించడం అందరిని షాక్ కి గురి చేసింది.

ఇంతకీ రజినీకాంత్ చేసిన ట్వీట్ ఏమిటంటే... భారత ప్రభుత్వం చేపట్టిన జనతా కర్ఫ్యూ కి మద్దతు పలుకుతూ జనాలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు అవ్వాలని తలైవా వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. అయితే కొద్దీ సేపటికే ట్విట్టర్ నుంచి ఆ వీడియో డిలీట్ అయ్యింది. అందుకు కారణం కొందరు నెటీజన్స్ ఆ వీడియోకు నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడమే అని తెలుస్తోంది. కరోనా గురించి అందరూ మద్దతు పలుకుతున్న తరుణంలో రజినీ చేసిన ట్వీట్ డిలీట్ అవ్వడం అభిమానులని షాక్ కి గురి చేసింది. ఇక రజినీకాంత్ చేసిన తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు.

 

కరోనా ప్రాణాలను ముంచేంత ప్రమాదకరమైనది కాదని సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటలీలో మాత్రం కరోనాను ఇదే తరహాలో ఆలోచించి పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఒకే రోజు వందల సంఖ్యలో జనాలు చనిపోతున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ మనం జాగ్రత్తగా ఉండాలని రజినీకాంత్ వీడియోలో తెలియజేశారు. ఇక రజినీకాంత్ రాజకీయాలకు దగ్గరగా ఉన్న సమయంలో నెగిటివ్ కామెంట్స్ రావడం తమిళ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

click me!