గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్

Published : Dec 27, 2019, 05:49 PM IST
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్

సారాంశం

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.  

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సింగర్ మంగ్లీ గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు
నానక్ రామ్ గూడ లొని రామానాయుడు స్టూడియోలో  మొక్కలు నాటిన సుడిగాలి సుధీర్.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు పెంచే బాధ్యత మనందరిపై ఉందని ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని పిలుపునిచ్చారు. మారిపోతున్న వాతావరణ కాలుష్యం వల్ల చాలా దేశాలలో ఆక్సిజన్ క్లబ్బులు; ఆక్సిజన్ జోన్లు ఏర్పాటు కుంటున్నారని ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడిందని అట్లాంటి పరిస్థితి మన దేశం కు రాకూడదని సంతోష్ అన్న గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా గొప్ప విషయం అని సంతోష్ అన్న కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈసందర్భంగా ఆయన మరోక ముగ్గురిని గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, సన్నిలకు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొ ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?