నెల్లూరులో తన ఇంటిని త్యాగం చేసిన ఎస్పీ బాలు.. ఎమోషనల్  కామెంట్స్!

By tirumala ANFirst Published Feb 12, 2020, 10:09 PM IST
Highlights

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులోని తన నివాసాన్ని ఓ గొప్ప కార్యం కోసం త్యాగం చేశారు. బాలసుబ్రహ్మణ్యం జన్మస్థలం నెల్లూరు అనే సంగతి తెలిసిందే. నెల్లూరులో పుట్టి పెరిగిన బాలు గాయకుడిగా చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానాన్ని అధిరోహించారు.

లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరులోని తన నివాసాన్ని ఓ గొప్ప కార్యం కోసం త్యాగం చేశారు. బాలసుబ్రహ్మణ్యం జన్మస్థలం నెల్లూరు అనే సంగతి తెలిసిందే. నెల్లూరులో పుట్టి పెరిగిన బాలు గాయకుడిగా చిత్ర పరిశ్రమలో అగ్ర స్థానాన్ని అధిరోహించారు. బాలసుబ్రహ్మణ్యంకు సంగీతంపై మక్కువతో పాటు.. భక్తి భావాలు కూడా ఎక్కువే. 

వేద పాఠశాల నిర్వహణ కోసం బాలసుబ్రహ్మణ్యం తన నివాసాన్ని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతికి సమర్పించారు. పూజా కార్యక్రమాల నడుమ బాలు తన నివాసాన్ని విజయేంద్ర సరస్వతికి సమర్పించారు. ఈ సంధర్భంగా విజయేంద్ర సరస్వతి బాలసుబ్రమణ్యం తండ్రి సాంబమూర్తిపై ప్రశంసలు కురిపించారు. 

సంగీతం, భక్తి భావాలని ప్రచారం చేసిన గొప్ప వ్యక్తి సాంబమూర్తి అని అన్నారు. ఆయన పేరుపై వేదపాఠశాలని దిగ్విజయంగా కొనసాగిస్తామని విజయేంద్ర సరస్వతి అన్నారు. బాలు తన ఇంటిని కంచి పీఠాధిపతికి సమర్పించే కార్యక్రమం మంగళవారం జరిగింది. 

నెల్లూరులో భక్తి భావాలని పెంచడం కోసం బిక్షాటన చేసి మరీ త్యాగరాజ స్వరణోత్సవాలని నిర్వహించిన ప్రతిభాశాలి సాంబమూర్తి అని విజయేంద్ర సరస్వతి కొనియాడారు. ఇదే కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడారు. తన తండ్రిని ఎమోషనల్ గా గుర్తుచేసుకున్నారు. మా తండ్రి పెద్ద శైవ భక్తులు. వారు ఇక్కడ లేరనే అసంతృప్తి ఉంది. కానీ వారి పేరుపై ఈ ఇంట్లో వేదపాఠశాల నిర్వహించడం వల్ల ఆయన ఇక్కడే ఉన్నట్లు భావిస్తానని బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 

కంచి పీఠానికి తాను ఏ గృహాన్ని సమర్పించానని అనడం సరికాదని.. భగవంతుడి సేవకు స్వామివారి తీసుకున్నారని చెప్పడం సబబు అని బాలు అన్నారు. విజయేంద్ర సరస్వతి తన ఇంట్లోకి వచ్చే సమయంలో బాలు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

click me!