టాలీవుడ్ లోకి రీఎంట్రీ.. రవితేజపై శృతి హాసన్ కామెంట్స్!

Published : Nov 16, 2019, 09:44 PM IST
టాలీవుడ్ లోకి రీఎంట్రీ.. రవితేజపై శృతి హాసన్ కామెంట్స్!

సారాంశం

కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొంది. గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్నాక ఇక శృతి వెనుదిరిగి చూసుకోలేదు.

కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో నిరాశాజనకమైన ఫలితాలు ఎదుర్కొంది. గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్నాక ఇక శృతి వెనుదిరిగి చూసుకోలేదు. వరుస విజయాలు శృతి హాసన్ ని వరించాయి. దీనితో శృతి హాసన్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. 

2017లో పవన్ కళ్యాణ్ సరసన నటించిన కాటమరాయుడు చిత్రం తర్వాత శృతి హాసన్ తెలుగులో మరో చిత్రంలో కనిపించలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో ఓ చిత్రానికి శృతి హాసన్ ఓకె చెప్పింది. ఇటీవల ప్రారంభమైన రవితేజ 'క్రాక్' చిత్రంలో శృతి హీరోయిన్ గా నటిస్తోంది. 

టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుండడంపై, బలుపు తర్వాత రవితేజతో రొమాన్స్ చేయనుండడంపై శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. బలుపు సెట్స్ లో నేను రవితేజ కలసి చేసిన రచ్చ నాకు ఇప్పటికి గుర్తే. 

క్రాక్ మూవీ కోసం కూడా అంతే ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. టాలీవుడ్ లో నటించడం అంటే నాకు ఎప్పుడూ సంతోషమే. టాలీవుడ్ నాకు రెండవ ఇల్లు లాంటిది అని శృతి హాసన్ తెలిపింది. 

శృతి హాసన్ ప్రస్తుతం తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల శృతి హాసన్ తన లండన్ ప్రియుడితో విడిపోయిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ లవ్ ఎఫైర్ , బ్రేకప్ వార్తలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 

PREV
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?