మా అమ్మా నాన్న విడిపోవడమే మంచిదైంది.. శృతి హాసన్!

By tirumala ANFirst Published Nov 6, 2019, 8:40 PM IST
Highlights

విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కెరీర్ ఆరంభంలో శృతి హాసన్ అనేక పరాజయాలు ఎదుర్కొంది. ఆమె నటించిన చిత్రాలు నిరాశపరుస్తుండడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర పండింది. 

శృతి హాసన్ గబ్బర్ సింగ్ చిత్రంతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత శృతి ఇక వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు తమిళ భాషల్లో అనేక విజయాలు సొంతం చేసుకుంది. వరుసగా బడా స్టార్స్ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంది. 

శృతి హాసన్ చివరగా తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు చిత్రంలో మెరిసింది. ఆ చిత్రం తర్వాత శృతి సినిమాలకు బాగా గ్యాప్ తీసుకుంది. మ్యూజిక్ ఆల్బమ్స్ తో బిజీగా మారింది.  ఈ ఏడాది శృతి హాసన్ హీరోయిన్ గా మళ్ళి బిజీ అవుతోంది. 

విజయ్ సేతుపతి సరసన లాభం అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు మాస్ మహారాజ, గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కే చిత్రానికి కూడా శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ తన తల్లిదండ్రుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక చాలా ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. 

తన తల్లి దండ్రుల గురించి శృతి మాట్లాడుతూ.. ఎంత మంచి కుటుంబం అయినప్పటికీ సమస్యలు తప్పకుండా ఉంటాయి. అలాగే మా ఫ్యామిలిలో మా తల్లిదండ్రుల మధ్య సమస్యలు తలెత్తాయి. ఇద్దరు వ్యక్తులు విడిపోతే అది తప్పకుండా వేదన కలిగించే అంశమే. 

కానీ కలసి సంతోషంగా జీవించలేనప్పుడు విడిపోవడమే మంచింది. మా తల్లిందండ్రులకు వ్యక్తిగత జీవితాలు ఉన్నారు. వారిద్దరూ కలవక ముందు ఇద్దరు వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు విడిపోయి సంతోషంగా ఉన్నారు. వారి జీవితాన్ని వారు జీవిస్తున్నారు అని శృతి హాసన్ పేర్కొంది. 

click me!